Jump to content

గోవా ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
(గోవా ఎక్స్ ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
గోవా ఎక్స్ ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్
స్థితిఆపరేటింగ్
స్థానికతగోవా, కర్నాటక , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ & ఢిల్లీ
ప్రస్తుతం నడిపేవారుసౌత్ వెస్ట్రన్ రైల్వే
మార్గం
మొదలువాస్కో-డ-గామా (VSG))
ఆగే స్టేషనులు27
గమ్యంహజ్రత్ నిజాముద్దీన్ (NZM)
ప్రయాణ దూరం2202 కి.మీ.
సగటు ప్రయాణ సమయం39 గం. 25 ని.
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)12779 / 12780
సదుపాయాలు
శ్రేణులు2వ ఎసి (2), ఎసి 3వ (3), స్లీపర్ (11), జనరల్ (3)
కూర్చునేందుకు సదుపాయాలుఅందుబాటు
పడుకునేందుకు సదుపాయాలుఅందుబాటు
ఆహార సదుపాయాలుఅందుబాటు
బ్యాగేజీ సదుపాయాలుఅందుబాటు
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగంసరాసరి - 55 కి.మీ./గ. Maximum - 110 కి.మీ./గ.

భారతీయ రైల్వే నడిపిస్తోన్న గోవా ఎక్స్ రైలు ప్రతి రోజు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్. వాస్కోడ గామా, న్యూ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ఈ రైలు నడుస్తుంటుంది. సౌత్ వెస్ట్రన్ రైల్వే ఆధ్వర్యంలో హుబ్లీ డివిజన్ లో నడిచే అతి ముఖ్యమైన రైలు కూడా ఇదే.[1]

చరిత్ర

[మార్చు]
12779 గోవా ఎక్స్ ప్రెస్ - ఎసి 3 టైర్ కోచ్

1987 లో ఈ రైలు 2479/2480 నెంబర్లతో ఉత్తర రైల్వే ఢిల్లీ డివిజన్ ఆధ్వర్యంలో మీటర్ గేజ్ మార్గంలో నిర్వహిస్తుండేది. ఆ తర్వాత ఈ రైలు నిర్వహణ బాధ్యతలను సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ డివిజన్ తీసుకుంది. అప్పటి నుంచి గోవా ఎక్స్ ప్రెస్ రైలు 12779/12780 నెంబర్లతో పూర్తి స్థాయి బ్రాడ్ గేజ్ పై నడుస్తోంది.

మార్గం

[మార్చు]
17305 హుబ్లి లింక్ ఎక్స్ ప్రెస్
17305 హుబ్లి లింక్ ఎక్స్ ప్రెస్ - ఎసి 2 టైర్ కోచ్

గోవా ఎక్స్ ప్రెస్ తన 39 గంటల 25 నిమిషాల ప్రయాణంలో మొత్తం 2202 కి.మీ. దూరం ఏడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. బ్రగాంజా కొండ ప్రాంతంలోని దూద్ సాగర్ జలపాతం మీదుగా ప్రయాణం సాగించే ఏకైక రైలు ఇది. వాస్కోడగామా నుంచి లోండా జంక్షన్ మార్గంలో ఈ రైలు ప్రయాణం ప్రకృతి పరంగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

సౌకర్యాలు

[మార్చు]

ఈ రైలులో 2 ఎసీ-2 టైర్స్, 3 ఏసీ-3 టైర్స్, 11 స్లీపర్ తరగతి, 3 రిజర్వేషన్ లేని సాధారణ బోగీలు, 1 ప్యాంట్రీ కార్ తోపాటు ఇతర బోగీలు సహా మొత్తం 22 బోగీలుంటాయి. కొన్ని సార్లు అదనంగా ఒక ఏసీ 3 టైర్స్ [B X1 పేరుతో] చేర్చుతారు.[2]


ఇవి కూడా చూడండి

[మార్చు]
  • సౌత్ వెస్ట్రన్ రైల్వే రైళ్లు
  • గోవా సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Goa express". IRI. Retrieved 2013-05-23.
  2. "Goa Express". Cleartrip. Archived from the original on 2014-05-31.

బయటి లింకులు

[మార్చు]