విరాంగం-ఓఖా రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విరాంగం-ఓఖా రైలు మార్గము
అవలోకనం
రకము (పద్ధతి)ప్రాంతీయ రైలు
లైట్ రైలు
స్థితిపనిచేస్తున్నది
లొకేల్గుజరాత్
చివరిస్థానంవిరాంగం
ఓఖా
ఆపరేషన్
ప్రారంభోత్సవం1922; 102 సంవత్సరాల క్రితం (1922)
నిర్వాహకులుపశ్చిమ రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు433 km (269 mi)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
ఆపరేటింగ్ వేగం80 kilometres per hour (50 mph)

విరాంగం-ఓఖా రైలు మార్గము గుజరాత్ రాష్ట్రం గుండా ప్రయాణించే ఒక రైలు మార్గము.

భౌగోళికం[మార్చు]

విరాంగం-ఓఖా రైలు మార్గము సురేంద్ర నగర్, వంకనేర్, రాజ్‌కోట్, జామ్‌నగర్ లతో గుజరాత్ యొక్క మధ్య భాగం ద్వారా అనుసంధానించుతూ వెళ్ళుతుంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో 433 కిలోమీటర్ల (269 మైళ్ళు) దూరం విస్తరించి ఉంది. ఈ క్రింది వివిధ విభాగాలలో వివరంగా వివరించబడింది:

  1. విరాంగం-సురేంద్ర నగర్ రైలు మార్గము
  2. వంకనేర్-సురేంద్ర నగర్ రైలు మార్గము
  3. రాజ్‌కోట్-వంకనేర్ రైలు మార్గము

చరిత్ర[మార్చు]

విరాంగం-ఓఖా రైలు మార్గము అనేక రాచరిక రాష్ట్రాల ఆధ్వర్యంలో వేయబడింది. 1871 సం.లో అహ్మదాబాద్-విరాంగం రైలు మార్గము, బాంబే, బరోడా, మధ్య రైల్వే ద్వారా నిర్మించారు. తదుపరి ఈ మార్గాన్ని వాధ్వాన్ వరకు 1872 సం.లో పొడిగించ బడింది. సురేంద్రనగర్-రాజ్‌కోట్ రైలు మార్గము 1890 సం.లో మోర్వీ స్టేట్ రైల్వే ద్వారా నిర్మించ బడింది. అలాగే రాజ్‌కోట్-జాంనగర్ రైలు మార్గం 1872 సం, లో నిర్మించ బడింది.[1] జాంనగర్-ఓఖా రైలు మార్గము 1922 సం.లో ప్రారంభించారు.రాజ్‌కోట్-జునాఘడ్-వీరావల్ రైలు మార్గం మొత్తం సౌరాష్ట్ర రైల్వేలో 1948, ఏప్రిల్ మాసంలో విలీనం అయ్యింది.[2] సౌరాష్ట్ర రైల్వే అంతా 1951 నవంబరు 5 సం.లో పశ్చిమ రైల్వేలో విలీనం అయ్యింది.[3] విరాంగం-హపా విభాగం యొక్క గేజ్ మార్పిడి పని 1980 జూన్ 17 న ముగిసింది. అదేవిధంగా, హపా-ఓఖా రైలు మార్గం విభాగం పనులు 1684 ఏప్రిల్ 24 నాటికి భారతీయ రైల్వేలు ద్వారా పూర్తి చేయబడ్డాయి.[4]

మూలాలు[మార్చు]

  1. "Irfca history (1870-1899)".
  2. "Irfca history (1900-1947)".
  3. "Irfca history (1947-1970)".
  4. "Irfca history (1971-1995)".