డెక్కన్ ఒడిస్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెక్కన్ ఒడిస్సీ
Deccan Odyssey
Deccan-odyssey-logo.png

డెక్కన్ ఒడిస్సీ భారతీయ రైల్వేలులో మహారాష్ట్ర మార్గంలో పర్యాటకం పెంచడానికి ప్యాలెస్ ఆన్ వీల్స్ నమూనా ఆధారంగా రూపొందించిన ఒక ప్రత్యేకమైన విలాసవంతమైన రైలు. దీని మార్గం ముంబైలో మొదలై రత్నగిరి, సింధుదుర్గ్, గోవా, కొల్హాపూర్, బెల్గాం, షోలాపూర్, నాందేడ్, ఔరంగాబాద్, అజంతా-ఎల్లోరా నాసిక్, పూణే వరకు ప్రయాణిస్తుంది. ఆపై తిరిగి ముంబై తిరిగి చేరుకుంటుంది.[1] ఇది మహారాష్ట్ర ప్రభుత్వం మరియు భారతదేశం యొక్క రైల్వే మంత్రిత్వ శాఖ కలసి చేస్తున్న ప్రభుత్వం యొక్క ఒక వ్యాపారం.[2] ఇది పర్యాటక ప్రాంతాలు కలుపుతున్న రైలు కావడంతో పాటు, ఈ చక్రాల మీద ఒక పూర్తి 5 నక్షత్రాల హోటల్, రెండు రెస్టారెంట్లు మరియు ఒక బార్, ఒక ఆవిరి స్నానం, వ్యాపార కేంద్రం మరియు ప్రయాణంలో ఇతర సౌకర్యాలతో కలిగి ఉండే లక్ష్యంతో రూపొందించడం జరిగింది. ఈ రైలుకు ప్రత్యేక సౌకర్యాలతో అమర్చబడిన కోచ్‌లు చెన్నై లోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా తయారు చేయబడ్డాయి. ప్రజల నుండి స్పందన పెద్దగా లేకపోవడం వలన 2004 లో మహారాష్ట్ర ప్రభుత్వం డెక్కన్ ఒడిస్సీ రైలును నడపటం ఆపివేసింది. కాని తిరిగి వర్షాకాలం తర్వాత అది తిరిగి ప్రారంభమయ్యింది.[3]

డెక్కన్ ఒడిస్సీ రైలు

గమ్యస్థానములు[మార్చు]

ముంబై - సింధుదుర్గ్ - గోవా - వాస్కో - కొల్హాపూర్ - ఔరంగాబాద్ (ఎల్లోరా) - జల్గావ్ (అజంతా) - నాసిక్ - ముంబై

ప్రయాణ కాలము[మార్చు]

పర్యటన వ్యవధి ముంబై నుండి ప్రతి బుధవారం ప్రారంభమయి 7 రాత్రులు ఉంటుంది.

వసతి[మార్చు]

ఈ రైలులో 10 పూర్తి ఎయిర్ కండిషన్డ్ డీలక్స్ క్యాబిన్ సెలూన్లు ఉంటాయి. ప్రతి సెలూన్ లో నాలుగు జంట పరుపుల పడకల గదులు కలిగి ఉంటుంది. అంతేకాక 2 పూర్తి ఎయిర్ కండిషన్డ్ అధ్యక్ష సూట్ సెలూన్లు ఉండి, ఇందులో ప్రతి సెలూన్ లో రెండు సూట్లు (పడకలు) కలిగి ఉంది. ఇందులోని గదిలో లివింగ్ రూం మరియు బెడ్ రూమ్ సదుపాయములు ఉన్నాయి. ప్రతి సెలూన్ లో ఛానల్ సంగీతం, ఇంటర్ కాం, ప్లేయర్, అటాచ్‌డ్ మరుగుదొడ్లు, వేడి మరియు చల్లని నీరు, షవర్, గోడ నుండి గోడ వరకు కార్పెట్లు మరియు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]