Jump to content

మైసూరు స్టేట్ రైల్వే

వికీపీడియా నుండి
మైసూరు స్టేట్ రైల్వే
తరహా
స్థాపన{{{foundation}}}
ప్రధానకేంద్రము
కార్య క్షేత్రంమైసూరు సామ్రాజ్యం
పరిశ్రమరైల్వేలు

మైసూర్ స్టేట్ రైల్వే (MSR) మైసూర్ రాష్ట్రంలో పనిచేసే ఒక రైల్వే. [1] MSR 1951 ఏప్రిల్ 14 న దక్షిణ రైల్వేలో భాగమైంది.

చరిత్ర

[మార్చు]

1879లో మద్రాసు రైల్వే కంపెనీ మద్రాసు రాయపురం నుండి బెంగళూరు నగరానికి రైలు మార్గాన్ని నిర్మించింది. ఆ మార్గాన్ని బెంగళూరు నుండి మైసూర్ వరకు పొడిగింపు కోసం మైసూర్ మహారాజా ప్రత్యేకంగా ఒక రైల్వే సంస్థను స్థాపించాడు. [2] ఈ సంస్థనే మైసూర్ స్టేట్ రైల్వేగా పిలిచారు. 1891లో మైసూర్-నంజన్‌గూడు సెక్షన్ను (25.51 కి.మీ.) ట్రాఫిక్ కోసం తెరిచారు. బీరూర్-షిమోగా సెక్షన్ను (60.74 కి.మీ.) 1899లోను, మరొక ముఖ్యమైన లైన్ యశ్వంత్పూర్-హిందూపూర్‌ను 1892-93 లోనూ తెరిచారు. 1911-12లో మైసూర్ ప్రభుత్వం రాష్ట్ర రైల్వే నిర్మాణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది ఇంజనీర్ ఇన్ చీఫ్ అయిన Mr. EAS బెల్ నియంత్రణలో ఉంచబడింది. షిమోగా - తాళగుప్ప సెక్షనుకు 1930లో శంకుస్థాపన చేసారు. 1951లో, ఇది మద్రాసు అండ్ సదరన్ మహారాఠా రైల్వేతో కలిసి దక్షిణ రైల్వేగా ఏర్పడింది.

రోలింగ్ స్టాక్

[మార్చు]

1936లో కంపెనీకి 39 లోకోమోటివ్‌లు, 216 కోచ్‌లు, 754 గూడ్స్ వ్యాగన్‌లు ఉండేవి. [3]

మూలాలు

[మార్చు]
  1. "A rail link to Mysores history". Times of India. 19 February 2012. Retrieved 14 February 2015.
  2. "Origin and development of Southern Railway" (PDF). Retrieved 14 February 2015.
  3. World Survey of Foreign Railways.