Jump to content

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
గంగా కావేరి ఎక్స్‌ప్రెస్
Ganga Kaveri Express Route Map
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థానికతతమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్
తొలి సేవజనవరి 11984
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే మండలం
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
గమ్యంచాప్రా
ప్రయాణ దూరం2,341 కి.మీ. (1,455 మై.)
సగటు ప్రయాణ సమయం42గంటలు
రైలు నడిచే విధంవారానికి రెండు మార్లు
రైలు సంఖ్య(లు)12669/ 12670
సదుపాయాలు
శ్రేణులుమొదటి తరగతి ఎ.సి,రెండవ తరగతి ఎ.సి,మూడవ తరగతి ఎ.సి,స్లీపర్ క్లాస్,జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుకలదు
సాంకేతికత
వేగం55 Km/hr (Average)

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, దక్షిణ రైల్వే మండలం నిర్వహిస్తున్న సూపర్ ఫాస్ట్  ఎక్స్‌ప్రెస్. ఇది తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుండి బీహార్ రాష్టం లో గల చాప్రా కు ప్రయాణిస్తుంది.

చరిత్ర

[మార్చు]

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ ను 1977 లో నాటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కమలాపతి త్రిపాఠీ ఈ రైలును వారణాసి, మద్రాస్ బీచ్ రైల్వే స్టేషన్ల మద్య 139/40 నెంబరుతో ప్రారంభించారు.అప్పట్లో చెన్నై, రామేశ్వరం ప్రాంతాల మద్య మీటర్ గేజ్ రైల్వే లైన్ మాత్రమే వుండేది.మద్రాస్ బీచ్ రైల్వే స్టేషన్ నుండి రామేశ్వరం చేరడానికి వీలుగా అక్కడి నుండి వేరొక గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ వుండేది.ఈ రైలుకు సూపర్ ఫాస్ట్ రైలు హోదా ఉన్నప్పటికి తరువాత దానిని తొలగించారు.ఈ రైలును తరువాత దీనిని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి బయలుదేరడం మొదలైంది. ఈ రైలు పేరును మద్రాస్ -వారణాసి ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చడం జరిగింది.1990ల్లో ఈ రైలు పేరును తిరిగి గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ గా మార్చారు.2006 వ సంవత్సరం నుండి ఈ రైలును బీహార్లో గల చాప్రా వరకు పొడిగించారు.

పద ఉత్పత్తి

[మార్చు]

భారతదేశంలో ముఖ్య నదులైన గంగా (వారణాసి, చాప్రా ల్లో ప్రవహించే నది), దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న కావేరి నదుల పేర్లను కలిపి గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ గా నామకరణం చేసారు.

ప్రయాణ మార్గం

[మార్చు]

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను సోమవారం, శనివారాల్లో 12669 నెంబరుతో సాయంత్రం 05గంటల 40నిమిషాలకు బయలుదేరి మూడవరోజు ఉదయం 11గంటల 45నిమిషాలకు చాప్రా చేరుతుంది.తిరుగుప్రయాణంలో 12670 నెంబరుతో చాప్రా నుండి రాత్రి 09గంటలకు బయలుదేరి మూడవరోజు మధ్యాహ్నం 14గంటల 25నిమిషాలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను చేరుతుంది.ఈ రైలు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ముఖ్య ప్రాంతాలైన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషనువరంగల్లు, సేవాగ్రాం, నాగ్పూర్, అలహాబాద్, వారణాసి, చాప్రా గుండా ప్రయాణిస్తుంది.

తరచుదనం

[మార్చు]

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను సోమవారం, శనివారాల్లో బయలుదేరి బుధవారం, సోమావారాలలో చాప్రా చేరుతుంది.గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ తిరుగుప్రయాణంలో సోమవారం, బుధవారాల్లో చాప్రా నుండి బయలుదేరి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషనుకు బుధవారం, శుక్రవారాలలో చేరుతుంది.

కోచ్ల కూర్పు

[మార్చు]

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ లో 1 ఎ.సి మొదటి, తరగతి,3 రెండవ తరగతి ఎ.సి భోగీలు,3 మూడవ తరగతి భోగీలు,12 స్లీపర్ క్లాస్ భోగీలు,2 జనరల్ భోగీలు,1 పాంట్రీకార్ లతో కలిపి మొత్తం 24 భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ HA1 A1 A2 A3 బి1 బి2 బి3 ఎస్1 ఎస్2 ఎస్3 PC ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 ఎస్9 ఎస్10 ఎస్11 ఎస్12 జనరల్ SLR

సమయ సారిణి

[మార్చు]
సం కోడ్ స్టేషను పేరు (కోడ్) రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభం 17:40 0.0 1
2 GDR గూడూరు 9:50 19:52 2ని 137.7 1
3 OGL ఒంగోలు 2144 2145 1ని 292.7 1
4 BZA విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను 00:10 00:20 10ని 431.3 2
5 KMT ఖమ్మం 01:39 01:40 1ని 530.4 2
6 WL వరంగల్లు 03:08 03:10 2ని 637.9 2
7 SKZR కాగజ్ నగర్ 06:33 06:35 2ని 811.3 2
8 BPQ బల్లార్షా జంక్షన్ 08:10 08:20 10ని 881.1 2
9 CD చంద్రపూర్ 08:37 08:40 3ని 894.8 2
10 SEGMNGP సేవాగ్రాం 10:23 10:25 2ని 1013.4 2
11 NGP నాగ్పూర్ 11:45 11:55 10ని 1089.6 2
12 PAR పండుర్ణ 13:09 13:10 1ని 1194.1 2
13 BZU బేతుల్ 14:30 14:32 2ని 1280.9 2
14 ET ఈటార్సీ 16:55 17:10 15ని 1387.9 2
15 PPI పిపరియ 18:03 18:05 2ని 1455.4 2
16 JBP జబల్పూర్ 20:40 20:50 10ని 1633.1 2
17 KTE కట్ని జంక్షన్ 22:05 22:10 5ని 1724.0 2
18 MYR మైహర్ 23:08 23:10 2ని 1786.9 2
19 STE సత్నా జంక్షన్ 23:45 23:55 10ని 1822.4 2
20 ALD అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను 03:50 04:15 25ని 1999.8 3
21 BOY భాదోహి 05:50 05:52 2ని 2089.8 3
22 BSB వారణాసి 07:05 07:20 15ని 2134.3 3
23 GCT ఘాజీపూర్ 08:25 08:30 5ని 2209.0 3
24 BUI బలీయా 10:17 10:22 5ని 2273.7 3
25 CPR చాప్రా 11:45 గమ్యం 2339.9 3

ట్రాక్షన్

[మార్చు]

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ కు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి ఈటార్సీ వరకు రాయపురం లోకోషెడ్ ఆధారిత WAP-7, లేదా ఈ రోడ్ ఆధారత WAP-4 లోకోమోటివ్లను, అక్కడినుండి చాప్రా వరకు ఈటార్సీ లోకోషేడ్ ఆధారిత WDM-3D/WDP-4D/WDM-3A డీఈజిల్ లోకో మోటివ్లను ఉపయోగిస్తారు.

సగటు వేగం

[మార్చు]

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ చెన్నై చాప్రాల మద్య గల 2340 కిలో మీటర్ల దూరాన్ని 42గంటల 5నిమిషాల ప్రయాణ సమయంతో 56 కిలో మీటర్ల సగటు వేగంతో పూర్తి చేస్తుంది.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూస:తూర్పు, ఈశాన్య భారతదేశం రైలు మార్గములు

ఇతరములు

[మార్చు]