గుంటూరు–తెనాలి రైలు మార్గము
Appearance
గుంటూరు రైల్వే డివిజను లో గుంటూరు–తెనాలి రైలు మార్గము | |
---|---|
అవలోకనం | |
స్థితి | పనిచేస్తున్నది |
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్ |
చివరిస్థానం | తెనాలి రేపల్లె |
ఆపరేషన్ | |
ప్రారంభోత్సవం | 1916 |
యజమాని | భారతీయ రైల్వేలు |
నిర్వాహకులు | దక్షిణ మధ్య రైల్వే |
సాంకేతికం | |
లైన్ పొడవు | 24.28 కి.మీ. (15.09 మై.) |
ట్రాక్ పొడవు | 44 కి.మీ. (27 మై.) |
ట్రాకుల సంఖ్య | 1 |
ట్రాక్ గేజ్ | బ్రాడ్ గేజ్ |
గుంటూరు–తెనాలి రైలు మార్గము అనెది భారతీయ రైల్వే లోని ఒక రైల్వే మార్గము. ఈ మార్గము గుంటూరు–తెనాలిని కలుపుతుంది. ఈ మార్గము తెనాలి రైల్వే స్టేషన్ వద్ద, హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, తెనాలి–రేపల్లె రైలు మార్గముని కలుస్తుంది.[1] ఈ మార్గములో విద్యుద్దీకరణ లేదు, ఇది ఒక ట్రాక్ మాత్రమే కలిగి ఉంది.[2]
చరిత్ర
[మార్చు]గుంటూరు–తెనాలి రైలు మార్గము, 1916 జనవరి లో, గుంటూరు-రేపల్లె రైలు బ్రాడ్ గేజ్ మార్గము ప్రాజెక్ట్ లోని ఒక భాగంగా నిర్మించారు. ఈ మార్గము మద్రాస్, దక్షిణ మహ్రాట్ట రైల్వే వారు యజమానిగా వ్యవహరించారు.[3][4]
అధికార పరిధి
[మార్చు]ఈ మార్గము పొడవు 25.28 కి.మీ. (15.71 మై.), ఇది గుంటూరు రైల్వే డివిజనుకి చెందినది. తెనాలి స్టేషను మాత్రం దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజనుకి చెందినది.[2][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Track-doubling work will begin in six months: official". The Hindu (in Indian English). 2011-09-22. Retrieved 2016-05-04.
- ↑ 2.0 2.1 "Guntur Division" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 8 December 2015. Retrieved 11 January 2016.
- ↑ Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. Retrieved 2013-03-13.
- ↑ "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2016-05-17.
- ↑ "Map of Tenali". India Rail Info. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 5 February 2015.
- ↑ "Map of Guntur". India Rail Info. Archived from the original on 5 డిసెంబరు 2015. Retrieved 5 February 2015.