కోయంబత్తూరు-షొరనూర్ రైలు మార్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోయంబత్తూరు-షొరనూర్ రైలు మార్గం
పాలక్కాడ్ జంక్షను
అవలోకనం
స్థితిపనిచేస్తోంది
లొకేల్తమిళనాడు, కేరళ
చివరిస్థానంకోయంబత్తూరు జంక్షను
షొరనూర్ జంక్షను
ఆపరేషన్
ప్రారంభోత్సవం1861; 163 సంవత్సరాల క్రితం (1861)
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ రైల్వే
డిపో (లు)ఈరోడ్
రోలింగ్ స్టాక్WDM-2, WDM-3A, WDM-3D, WDG-3A, WDG-4 డీజిల్ లోకోలు; WAG-7, WAP-4 ఎలక్ట్రిక్ లోకోలు
సాంకేతికం
ట్రాక్ పొడవుప్రధాన మార్గం: 88 km (55 mi)
కోయంబత్తూరు-మెట్టుపాళయం54 km (34 mi)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
ఆపరేటింగ్ వేగం130 kilometres per hour (81 mph)
అత్యధిక ఎత్తుకోయంబత్తూరు 411 metres (1,348 ft)
షొరనూరు 26 metres (85 ft)
పాలక్కాడ్ 84 metres (276 ft)
మార్గ పటం
మూస:Coimbatore–Shoranur line

కోయంబత్తూరు-షోరనూర్ లైన్ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్, కేరళలోని షోరనూర్‌లను కలుపుతుంది. పొత్తనూర్ - కోయంబత్తూర్ - మెట్టుపాళయం, మెట్టుపాళయం నుండి ఉదగమండలం వరకు నీలగిరి మౌంటైన్ రైల్వే అనే బ్రాంచ్ లైన్ ఉంది. ఈ నెట్‌వర్కు, కేరళలోని రైల్వే నెట్‌వర్కును పాలక్కాడ్ గ్యాప్ ద్వారా తమిళనాడులోని నెట్‌వర్క్‌కు కలుపుతుంది.

చరిత్ర[మార్చు]

1856లో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు సేవ, భారతదేశంలో మూడవది మద్రాసు రైల్వే ద్వారా రాయపురం నుండి వాలాజా రోడ్ వరకు మొదలైంది. మద్రాస్ రైల్వే 1861 లో దాని ట్రంక్ మార్గాన్ని కోజికోడ్ వరకు విస్తరించింది. [1] పోదనూరు-మెట్టుపాళయం లైను 1873లో ట్రాఫిక్‌కు తెరవబడింది. యునెస్కో హెరిటేజ్ ట్రాక్, నీలగిరి మౌంటైన్ రైల్వేను రెండు దశల్లో ప్రారంభించారు. మెట్టుపాళయం-కూనూర్ సెక్షన్ను 1899లో ప్రారంభించారు. 1908లో దీన్ని ఉదగమండలం (ఊటీ) వరకు విస్తరించారు [2] [3]

వేగ పరిమితి[మార్చు]

కోయంబత్తూర్-షోరనూర్ లైన్ను "గ్రూప్ B" గా వర్గీకరించారు. ఇక్కడ వేగం 130 కిమీ/గం వరకు ఉంటుంది. ప్రస్తుతం అనుమతించిన గరిష్ట వేగం, పాలక్కాడ్ షోరనూర్ సెక్షనులో 110 కిమీ/గం. [4]

ఈ లైన్‌లో ఉన్న కోయంబత్తూర్, పాలక్కాడ్ స్టేషన్లు భారతీయ రైల్వేల టాప్ వంద బుకింగ్ స్టేషన్‌లలో ఉన్నాయి. [5] ఇటీవలి వర్గీకరణ ప్రకారం కోయంబత్తూరును NSG-1గా వర్గీకరించారు.

మూలాలు[మార్చు]

  1. "IR History – Early days". 1832–1869. IRFCA. Retrieved 23 December 2013.
  2. "Mettupalam-Udhagamandalam (Ooty) Train". india invites. Archived from the original on 24 December 2013. Retrieved 23 December 2013.
  3. "Mettuapalayam" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 20 January 2013. Retrieved 23 December 2013.
  4. "Chapter II : The Maintenance of Permanent Way". Archived from the original on 3 December 2013. Retrieved 23 December 2013.
  5. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 10 May 2014. Retrieved 23 December 2013.