నీలంబూర్-షొరనూర్ రైలు మార్గం
| నీలంబూర్-షొరనూర్ రైలు మార్గం | |||
|---|---|---|---|
అంగడిపురం స్టేషను | |||
| అవలోకనం | |||
| వ్యవస్థ | దక్షిణ రైల్వే | ||
| స్థితి | పనిచేస్తోంది | ||
| లొకేల్ | మలప్పురం, పాలక్కాడ్ | ||
| చివరిస్థానం | నీలంబూర్ రోడ్ షొరనూర్ జంక్షన్ | ||
| స్టేషన్లు | 11 | ||
| సేవలు | 7 | ||
| ఆపరేషన్ | |||
| ప్రారంభోత్సవం | 1927 | ||
| యజమాని | భారతీయ రైల్వేలు | ||
| నిర్వాహకులు | దక్షిణ రైల్వే | ||
| రోలింగ్ స్టాక్ | ICF కోచిలు | ||
| సాంకేతికం | |||
| లైన్ పొడవు | 66 kilometres (41 mi) | ||
| ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||
| ఆపరేటింగ్ వేగం | 100 kilometres per hour (62 mph) | ||
| |||
1840లో, బ్రిటీష్ వారు స్థిరమైన కలప సరఫరా కోసం నిలంబూరులో టేకు తోటను పెంచారు. [1] 1923లో, మద్రాసు-షోరనూర్-మంగుళూరు లైన్‌ను నిర్వహించే దక్షిణ భారత రైల్వే కంపెనీ, ఈ అడవుల నుండి మైదాన ప్రాంతాలకు, అక్కడి నుండి ఓడరేవులకూ కలపను సులభంగా రవాణా చేయడానికి నిలంబూరు నుండి షోరనూర్ వరకు రైలును నిర్మించడానికి మద్రాసు ప్రెసిడెన్సీ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ దశలవారీగా లైన్‌ను పూర్తి చేసింది. షోరనూర్-అంగడిపురం సెక్షన్ను 1927 ఫిబ్రవరి 3 న, అంగడిప్పురం -వాణియంబలం విభాగాన్ని 1927 ఆగస్టు 3 న ప్రారంభించారు. షోరనూర్ నుండి నిలంబూర్ వరకు మొత్తం మార్గాన్ని 1927 అక్టోబర్ 26 న తెరిచారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, బ్రిటీష్ ఇండియా అంతటా ఉన్న అనేక రైల్వే లైన్లతో పాటు షోరనూర్ లైన్ను కూడా తొలగించి, బ్రిటీష్ యుద్ధ ప్రయత్నాలకు సహాయం చేయడానికి మధ్యప్రాచ్యానికి మళ్లించారు. ఈ లైన్ 1941లో నిలిచిపోయింది. స్వాతంత్ర్యం తరువాత, ప్రజల ఒత్తిడిపై, రైల్వే మార్గాన్ని భారతీయ రైల్వేలు దాని పూర్వపు దారి లోనే మళ్ళీ నిర్మించింది. షోర్నూర్ -అంగడిపురం లైన్ను 1953 లోను, [2] అంగడిపురం-నిలంబూర్ మార్గాన్ని 1954 లోనూ పునఃప్రారంభించారు. [3] టేకు తోట నేటికీ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ "Nilambur Teak Plantations, Malappuram". Kerala Tourism. Retrieved 2016-12-13.
- ↑ "Railway Budget speech 1954–55" (PDF). www.indianrailways.gov.in. Government of India, Ministry of Railways. 19 February 1954.
- ↑ "Railway Budget speech 1955_56" (PDF). www.indianrailways.gov.in. Government of India, Ministry of Railways. 22 February 1955.