షొరనూర్-కొచ్చిన్ హార్బర్ రైలు మార్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

షొరనూర్-కొచ్చిన్ హార్బర్ రైలు మార్గం
త్రిస్సూర్ సిటీ రైల్వే స్టేషను
అవలోకనం
రకము (పద్ధతి)ప్రాంతీయ రైల్వే
వ్యవస్థవిద్యుత్తు
స్థితిపనిచేస్తోంది
లొకేల్కేరళ
చివరిస్థానంషొరనూర్ జంక్షన్
కొచ్చిన్ హార్బరు
స్టేషన్లు22
సేవలు2
వెబ్సైట్[1]
ఆపరేషన్
ప్రారంభోత్సవం16 జూలై 1902; 121 సంవత్సరాల క్రితం (1902-07-16)
యజమానిదక్షిణ రైల్వే
నిర్వాహకులుపాలక్కాడ్ జంక్షన్
తిరువనంతపురం
డిపో (లు)ఎర్నాకుళం
రోలింగ్ స్టాక్WAP-1, WAP-4, WAP-7 ఎలక్ట్రిక్ లోకోలు; WDS-6, WDM-2, WDM-3A, WDP-4] WDG-3A, WDG-4
సాంకేతికం
లైన్ పొడవు107 kilometres (66 mi)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
ఆపరేటింగ్ వేగం90 kilometres per hour (56 mph)
మార్గ పటం
మూస:Shoranur–Ernakulam line

షోరనూర్-కొచ్చిన్ హార్బర్ విభాగం కేరళ రాష్ట్రంలోని అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్. ఇది పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్ జంక్షన్ నుండి త్రిసూర్ జిల్లా గుండా ఎర్నాకులం జిల్లాలోని కొచ్చిన్ వరకు నడుస్తుంది. షోరనూర్-కొచ్చిన్ హార్బర్ విభాగం వ్యూహాత్మకమైనది, కేరళ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం, ఇది రాష్ట్రాన్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. కేరళ నుండి భారతదేశంలోని ఇతర నగరాలకు వేగవంతమైన, సుదూర ఇంటర్‌సిటీ, ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ సేవలను అందించడంలో ఇది ప్రధానమైనది. దీన్ని దక్షిణ రైల్వే జోన్‌లోని తిరువనంతపురం రైల్వే డివిజన్ నిర్వహిస్తుంది.

చరిత్ర[మార్చు]

కొచ్చిన్ మహారాజు (1895-1914) రాజర్షి అని పిలువబడే రామవర్మ, షోరనూర్ జంక్షన్ - కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ రైలు మార్గాన్ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించాడు. బ్రిటీష్ సామ్రాజ్యపు రెసిడెంటుతో 1862 నుండి రైలు మార్గాన్ని స్థాపించే మార్గాలపై మహారాజా సుదీర్ఘమైన, వివరణాత్మక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడని ఆర్కైవ్‌లోని రికార్డులు వెల్లడిస్తున్నాయి. [1]

చివరగా బ్రిటిషు వారు, లైన్లు వేయడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్రమే భరించాలని కోరారు. కొచ్చిన్ రాజ్యం అప్పుడు గణనీయమైన పెట్టుబడిని భరించేంత సంపన్నమైనది కాదు. కానీ మహారాజు తన వద్ద ఉన్న విలువైన వస్తువులలో కొంత భాగాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. కొచ్చిన్ రాజ్యపు ఖజానా రికార్డులు, మహారాజు శ్రీ పూర్ణత్రయేస ఆలయానికి చెందిన 14 బంగారు ఏనుగుల అలంకార ఆభరణాలను, కొచ్చిన్ రాజ కుటుంబానికి చెందిన ఇతర వ్యక్తిగత ఆభరణాలనూ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి విక్రయించినట్లు రుజువు చేస్తున్నాయి. [2]

నిధులు మంజూరయ్యాక ప్రాజెక్టు మరో అడ్డంకిలో పడింది. అంగమలీ, ఎడపల్లి మధ్య, దాదాపు 18 miles (29 km) రైల్వే లైన్, పూర్వపు ట్రావెన్‌కోర్ రాష్ట్రం గుండా వెళ్ళింది. 1899 అక్టోబరులో, రైల్వే లైన్ వేయడానికి అవసరమైన భూమిని అప్పగించాలని ట్రావెన్‌కోర్ రాష్ట్రాన్ని అభ్యర్థించారు. నిర్మాణం 1899లో ప్రారంభమైంది. కొచ్చిన్ రాష్ట్రం తరపున మద్రాస్ రైల్వే కంపెనీ దీన్ని చేపట్టింది. ఈ మార్గంలో కొన్ని నదులపై వంతెనలు నిర్మించాల్సి ఉండడంతో పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగింది. జూన్ 2న సరకు రవాణా కోసం, 1902 జూలై 16 న ప్రయాణికుల కోసం ఈ మార్గాన్ని తెరిచారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. తర్వాత 1935 అక్టోబర్ 24 న మీటర్ గేజ్ లైన్ను బ్రాడ్ గేజికి మార్చారు . [3] పి. రాజగోపాలాచారి (1896-1901) దివానుగా ఉన్న సమయంలో రైలు మార్గం పూర్తైంది. సిజి హెర్బర్ట్ (1930-1935) దివానుగా ఉన్నపుడు ఈ లైన్ మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌గా మార్చారు.


దాదాపు 62 miles (100 km) పొడవున్న షోరనూర్ జంక్షన్ - కొచ్చి మీటర్ గేజ్ రైలు మార్గం కేరళ హైకోర్టు వెనుక ఉన్న ఎర్నాకులం టెర్మినస్ స్టేషన్ వద్ద ముగిసింది. మొదట్లో ఒకే ట్రాక్ ఉండేది. ఇంజన్ తిరిగేందుకు వీలుగా ఇక్కడ వృత్తాకార ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులను ఎక్కించుకోవడానికి బస్సులు, రిక్షాలు స్టేషన్‌కు వచ్చేవి. మహారాజా ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే రైలుకు జోడించబడే ఒక ప్రత్యేకమైన సెలూన్ ఉండేది. రాయల్ వెయిటింగ్ రూమ్‌లోకి ప్రవేశం రాజకుటుంబ సభ్యులు, విఐపిలకు మాత్రమే పరిమితం చేయబడింది. [3] [4]

1907 డిసెంబరు 31 న మద్రాస్ గ్యారెంటీడ్ రైల్వే ని భారతదేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కొనుగోలు చేయడంతో కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఉత్తర మార్గాలను సదరన్ మరాఠా రైల్వే కోకి మార్చారు. విస్తరించిన సంస్థ పేరు మద్రాస్ అండ్ సదరన్ మహరాఠా రైల్వే కోగా మారింది. జోలార్‌పేట నుండి మంగళూరు వరకు ఉన్న దక్షిణ మార్గాలు, బ్రాంచ్ లైన్‌లతో సహా మద్రాస్ - బెంగుళూరు సెక్షన్‌తో పాటు దక్షిణ భారత రైల్వే కోకు వెళ్ళాయి. షోరనూర్ - కొచ్చిన్ రైల్వే లైన్ను 1902 జూలై 16 న తెరిచారు. ఈ లైన్ కొచ్చిన్ ప్రభుత్వ ఆస్తి. దీన్ని దక్షిణ భారత రైల్వే కంపెనీ నడిపింది. [4] కొచ్చిన్ పోర్ట్ అభివృద్ధిలో భాగంగా 1930, 1935 మధ్య ఈ లైన్ను బ్రాడ్ గేజ్‌గా మార్చారు.

స్వాతంత్ర్యం తరువాత[మార్చు]

స్వాతంత్ర్యం తరువాత ఈ మార్గాన్ని, 1956 ఆగస్టు 31 న ఏర్పడిన పాలక్కాడ్ రైల్వే డివిజన్‌కు కేటాయించారు. తరువాత 1979 అక్టోబరు 2 న, దీన్ని దక్షిణ రైల్వే పరిధిలోని తిరువనంతపురం రైల్వే డివిజన్‌కు బదిలీ చేసారు. 1986లో, షోరనూర్-ఎర్నాకులం డబ్లింగ్ పూర్తయింది. ఈ లైన్ విద్యుదీకరణ 1996లో పూర్తయింది. త్రిసూర్ నుండి గురువాయూర్‌ను కలుపుతూ 23 కిలోమీటర్ల దూరానికి కొత్త బ్రాడ్ గేజ్ లైన్ను 1994లో ప్రారంభించారు.

ఆర్థిక ప్రాముఖ్యత[మార్చు]

ప్రతిరోజు సగటున 110 రైళ్లు (60 ప్యాసింజర్, 35 గూడ్స్ రైలు) ఈ హై డెన్సిటీ కారిడార్ గుండా ప్రయాణిస్తాయి. [5] [6] 1943 వరకు కేరళ రాష్ట్రానికి సరుకులన్నీ బ్యాక్ వాటర్ ద్వారానే రవాణా అయ్యేవి. షోరనూర్ - కొచ్చిన్ హార్బర్ సెక్షన్ వచ్చిన తర్వాత బ్యాక్‌వాటర్స్ తన వైభవాన్ని కోల్పోయింది. చాలా వరకు సరుకులను రైళ్ల ద్వారా తీసుకువెళ్లారు. టైల్స్, కలప, చెక్క ప్యాకింగ్ పెట్టెలు ఒల్లూరు రైల్వే స్టేషన్ నుండి షోరనూర్ - కొచ్చిన్ హార్బర్ సెక్షన్ ద్వారా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేయబడిన ప్రధాన వస్తువులు. తరువాత ఈ వస్తువుల స్థానంలో కొచ్చి రిఫైనరీస్ లిమిటెడ్ నుండి ఉత్పత్తయ్యే పెట్రోలియం వస్తువులు, కొచ్చి LNG టెర్మినల్ నుండి LPG, డీజిల్, సిమెంట్ సంచులు, ఇనుప ఖనిజం, బొగ్గు, రాగి, ఉక్కు కడ్డీలు, ఉప్పు, పంచదార, బియ్యం, గోధుమలు, కంటైనర్లు మొదలైనవి వచ్చి చేరాయి.

మూలాలు[మార్చు]

  1. "Chugging through memory rail". The Hindu. 2002-07-15.
  2. "Waiting for the TRAIN of Hope". The Hindu. Chennai, India. 24 June 2004. Archived from the original on 10 November 2004. Retrieved 2010-09-22.
  3. 3.0 3.1 "Bifurcation of division to affect rail development". The Hindu. Chennai, India. 20 December 2005. Archived from the original on 4 November 2012. Retrieved 2010-09-22.
  4. 4.0 4.1 "Railways cross a milestone". The Hindu. Chennai, India. 12 April 2010. Archived from the original on 1 May 2010. Retrieved 2010-09-22.
  5. "Goods train not moving in Shoranur-Cochin corridor". manoramaonline.com. Archived from the original on 5 November 2012. Retrieved 2012-11-07.
  6. "Shoranur-Cochin corridor". manoramaonline.com. Archived from the original on 5 November 2012. Retrieved 2012-11-07.