Jump to content

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్
Narayanadri Express
సారాంశం
రైలు వర్గంవేగవంతమైన రైలు
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలులింగంపల్లి
ఆగే స్టేషనులులింగంపల్లి , తిరుపతి ప్రధానం మధ్య 23 చోట్ల ఆగుతుంది.
గమ్యంతిరుపతి ప్రధానం
ప్రయాణ దూరం661 కి.మీ. (411 మై.)
సగటు ప్రయాణ సమయం12 గంటలు
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)12734 / 12733
సదుపాయాలు
శ్రేణులు2-3ఎసి, 1-2ఎసి, 1 కోంబో కోచ్ 1ఎసి , 2ఎసి(హెచ్‌ఎ1), 14 ఎస్‌ఎల్, 3 జనరల్, 2 ఎస్‌ఎల్‌ఆర్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలుసీట్లు కింద
ఇతర సదుపాయాలుLHB Rake
సాంకేతికత
రోలింగ్ స్టాక్4
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in) (బ్రాడ్ గేజ్)
వేగం59 km/h (37 mph) (సగటుతో చేరుతుంది)
మార్గపటం

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు మర్గ పటము
(12733-12734 నారాయణాద్రి −12703-12704 ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ )
12733 నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ - ఎసి 2 టైర్

.

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, నెం 12733/12734 భారతీయ రైల్వేలుకు చెందిన ఒక రోజువారీ సూపర్ ఫాస్ట్ రైలు, ఇది లింగంపల్లి-తిరుపతికి నడుమ నడుస్తున్న రైలుబండి.[1] ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే చెందినది. ఈ రైలు పేరు తిరుపతి లోని ఏడు కొండలు గుర్తుగా పెట్టారు. ఈ రైలు 17:30 గంటలకు లింగంపల్లి నుండి బయలుదేరి, మరుసటి రోజు న ఉదయం 06:00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో 18:25 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు న ఉదయం 07:10 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

లోకో లింకులు

[మార్చు]

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి నుండి తిరుపతి మార్గమున ఒక విద్యుత్ లోకోమోటివ్‌తో నడుస్తుంది (డబ్ల్యుఎపి-4/డబ్ల్యుఎపి-7) . మరలా తిరుగు ప్రయాణం కూడా అదే విధంగా లింకులు ఉంటాయి.

తరగతులు

[మార్చు]

రైలు సాధారణంగా (సెప్టెంబరు '09 లెక్కలు ప్రకారం చూపించారు) ఒక 1 ఎసి, 2 ఎసి కాంబో కోచ్, 1 ఎసి 2-టైర్ కోచ్, 2 ఎసి 3-టైర్ కోచ్‌లు, 14 స్లీపర్ క్లాస్ బోగీలు, 1 పాంట్రీ కారు, 3 జనరల్ కంపార్ట్మెంట్లు, 2 ఎస్‌ఎల్‌ఆర్ కలిగి ఉంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ యొక్క ఒక (రేక్) రైలుబండి 24 బోగీలు కలిగి ఉంది. ఇది ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ దాని భోగీలను పంచుకుంటుంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ భోగీల మీద తిరుపతి-సికింద్రాబాద్-హౌరా బోర్డులు (నామఫలకాలు) చూడగలరు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Narayanadri Express/2734". Indian Railways. Retrieved 2 April 2010.

బయటి లింకులు

[మార్చు]