కాచిగూడ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Kachiguda
కాచిగూడ
కాచిగూడ రైల్వే స్టేషన్
కాచిగూడ రైల్వే స్టేషన్
Kachiguda is located in తెలంగాణ
Kachiguda
తెలంగాణ రాష్ట్రంలో ఉనికి
భౌగోళికాంశాలు: 17°23′29″N 78°29′43″E / 17.391269°N 78.49524°E / 17.391269; 78.49524Coordinates: 17°23′29″N 78°29′43″E / 17.391269°N 78.49524°E / 17.391269; 78.49524
దేశం  India
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మెట్రో హైదరాబాదు
ప్రభుత్వం
 • సంస్థ జి.హెచ్.ఎం.సి
భాషలు
 • అధికార తెలుగు
సమయప్రాంతం IST (UTC+5:30)
పిన్‌కోడు 500 027
లోక్ సభ నియోజకవర్గం సికింద్రాబాదు
విధానసభ నియోజకవర్గం అంబర్‌పేట
ప్రణాళికా ఏజెన్సీ జి.హెచ్.ఎం.సి

కాచిగూడ (ఆంగ్లం Kachiguda) హైదరాబాదు నగరంలోని ప్రాంతము. ఇది మూసీ నదికి ఉత్తర ఒడ్డున ఉంది.

విశేషాలు[మార్చు]

నిజాం కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషను కాచిగూడ రైల్వేస్టేషను (Kachiguda Railway Station) ఇక్కడ ఉంది. సమీపంలోని కొండ మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన కాచిగూడ రక్షకభట నిలయము (Police Station) ఉంది.

కాచిగూడ రైల్వేస్టేషన్

వాణిజ్య ప్రాంతం[మార్చు]

ఇది హైదరాబాదు లోని షాపింగ్ కోసం ఉన్న ఒక ప్రాంతం. సుల్తాన్ బజార్లో వస్త్రాలు లభిస్తాయి. తారకరామ, వెంకటరమణ, పద్మావతి మొదలైన సినిమా హాల్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రసిద్ధిచెందిన టూరిస్ట్ హోటల్ ఈ మధ్యనే ఆధునీకరణ చేయబడింది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

The MMTS station

కాచిగూడ ప్రాంతం నుండి హైదరాబాదు లోని అన్ని ప్రాంతాలకు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. (APSRTC) బస్సు సర్వీసులు నడిపిస్తుంది. ఈ ప్రాంతంలో బస్ డిపో కూడా ఉంది. ఇక్కడ MMTS రైల్వేస్టేషను కూడా ఉంది.

ఇచట ప్రముఖ హోటల్ టూరిస్టు ప్లాజా హోటల్. దీనిని నూతనంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో వైష్ణవీ హోటల్, పంచరత్న హోటల్ మరియు నంద్ ఇంటర్నేషనల్ లు ఉన్నాయి. ఇచట ప్రముఖ శాకాహార హోటల్స్ అయిన హోటల్ స్వీకార్, ఇన్విటేషన్ రెస్టారెంట్, స్వాద్ రెస్టారెండు కూడా ఉన్నాయి[1]

విద్యాలయాలు[మార్చు]

ఇక్కడ ప్రాచీనమైన అమృత్ కపాడియా డిగ్రీ కళాశాల (Amruth Kapadia Degree College) ఉంది. ఇక్కడ వైశ్యా వసతిగృహం (Vysya Hostel) ఉంది.

వైద్యశాలలు[మార్చు]

  • శ్రీవెంకటేశ్ బర్గోంకర్ నర్సింగ్ హోమ్
  • శ్రీసాయికృష్ణ న్యూరో హాస్పిటల్

దేవాలయాలు[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కాచిగూడ&oldid=2212406" నుండి వెలికితీశారు