సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు
[మార్చు]- హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 24 నుంచి 28, 30 (పాక్షికం). ఈ నియోజకవర్గంలో మారేడ్ పల్లి, తిరుమల గిరి, బొల్లారం, సిక్కు గ్రామం, లోతు కుంట, కార్ఖానా, బేగంపేట, రాష్ట్రపతి రోడ్డు మండలాలు ఉన్నాయి.
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[1]
(ఉప ఎన్నిక) |
71 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | శ్రీ గణేష్ నారాయణన్ | పు | కాంగ్రెస్ | 53651 | టీ.ఎన్. వంశా తిలక్ | పు | బీజేపీ | 40445 |
2023[2] | 71 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | లాస్య నందిత | స్త్రీ | బీఆర్ఎస్ | 59057 | శ్రీ గణేష్ నారాయణన్ | పు | బీజేపీ | 41888 |
2018 | 71 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | జి. సాయన్న | పు | టిఆర్ఎస్[3] | 65797 | సర్వే సత్యనారాయణ | పు | కాంగ్రెస్ | 28234 |
2014 | 71 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | జి. సాయన్న | పు | టీడీపీ | 44693 | గజ్జెల నాగేశ్ | పు | టిఆర్ఎస్ | 41418 |
2009 | 71 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | పి.శంకరరావు | పు | కాంగ్రెస్ | 36853 | జి. సాయన్న | పు | టీడీపీ | 32670 |
2004 | 211 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | జి. సాయన్న | పు | టీడీపీ | 89684 | రావుల అంజయ్య | పు | టిఆర్ఎస్ | 74652 |
1999 | 211 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | జి. సాయన్న | పు | టీడీపీ | 95227 | డి.బి. దేవేందర్ | పు | కాంగ్రెస్ | 65286 |
1994 | 211 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | జి. సాయన్న | పు | టీడీపీ | 47603 | డి. నర్సింగ్ రావు | పు | కాంగ్రెస్ | 43967 |
1989 | 211 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | డి.నర్సింగ్ రావు | పు | కాంగ్రెస్ | 55703 | ఎన్.ఏ. కృష్ణ | పు | టీడీపీ | 32904 |
1985 | 211 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | సర్వే సత్యనారాయణ | పు | టీడీపీ | 35427 | బి. మచ్చేందర్ రావు | పు | కాంగ్రెస్ | 28521 |
1983 | 211 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | ఎన్.ఏ. కృష్ణ | పు | స్వతంత్ర | 25847 | బి. మచ్చేందర్ రావు | పు | కాంగ్రెస్ | 16808 |
1978 | 211 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | బి. మచ్చేందర్ రావు[4] | పు | జనతా పార్టీ | 15946 | ముత్తు స్వామి | పు | కాంగ్రెస్ | 15580 |
1972 | 215 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | వీ. మంకమ్మ[5][6] | పు | కాంగ్రెస్ | 18891 | బి.ఎం. నర్సింహా | పు | ఎస్.టి.ఎస్ | 11187 |
1967 | 215 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | వీ. ఆర్. రావు | పు | కాంగ్రెస్ | 22643 | బి.దేవరాజన్ | పు | స్వతంత్ర | 11558 |
1962 | 218 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | బి.వి.గురుమూర్తి | పు | కాంగ్రెస్ | 18209 | పి. జగన్నాధన్ | పు | స్వతంత్ర | 7970 |
1957 | 21 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | (ఎస్సీ) | బి.వి.గురుమూర్తి | పు | కాంగ్రెస్ | 17578 | పి. జగన్నాధన్ | పు | పి.ఎస్.పి | 7572 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున జి.శాయన్న పోటీ చేస్తున్నాడు.[7]
2024 ఉప ఎన్నిక
[మార్చు]2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించగా, ఖాళీ అయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానానికి మే 13న నిర్వహిస్తామని సీఈసీ ప్రకటించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. [8] సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది.ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ ఘనవిజయం సాధించారు.ఆయన తన సమీప ప్రత్యర్థి,భారతీయ జనతా పార్టీ నేత వంశీచంద్ తిలక్ పై 13,206 ఓట్ల మెజారిటీని సాధించారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి దివంగత ఎమ్మల్యే లాస్యనందిత సోదరి, మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తే నివేదిత మూడో స్థానంలో నిలచింది.గత ఎన్నికల్లో లాస్యనందిత 59,057 ఓట్లతో విజయం సాధించగా ఇప్పుడు నివేదత కు 34,462 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాదు లో అడుగు పెట్టింది. గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 16 స్థానాలను భారత రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది.మిగతా వాటిలో ఏడు మజ్లిస్ ఒకటి భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరాయి.కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక పోయింది.[9]
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | శ్రీ గణేష్ నారాయణన్ | 53,651 | 40.86% | ||
బీజేపీ | TN వంశీచంద్ తిలక్ | 40,445 | 30.8% | ||
బీఆర్ఎస్ | జి నివేదిత సాయన్న | 34,462 | 26.25% | ||
నోటా | పైవేవీ లేవు | 969 | 0.74% | ||
మెజారిటీ | 13,206 | 17.10% | |||
పోలింగ్ శాతం | 1,31,294 | 98.65% | 0 |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Cantonment Assembly Bye Election". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Eenadu (16 November 2023). "7 దశాబ్దాలు 10 మందే వనితలు". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
- ↑ Eenadu (5 November 2023). "56 ఏళ్లలో ఒక్కసారే మహిళా ప్రాతినిధ్యం". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ V6 Velugu (16 March 2024). "మే13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ IANS (2024-06-05). "Congress wrests Secunderabad Cantonment Assembly seat from BRS". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2024-06-08.