అమీర్‌పేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?అమీర్‌పేట
హైదరాబాద్ • తెలంగాణ • భారతదేశం
చాతి ఆసుపత్రి, ఎర్రగడ్డ
చాతి ఆసుపత్రి, ఎర్రగడ్డ
అక్షాంశరేఖాంశాలు: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) హైదరాబాద్ జిల్లా జిల్లా
లోక్‌సభ నియోజకవర్గం సికందరాబాద్
శాసనసభ నియోజకవర్గం సనత్ నగర్
కోడులు
పిన్‌కోడు

• 500016


అమీర్‌పేట ( ఆంగ్లం:Ameerpet ) హైదరాబాద్ నగర ఉత్తర పశ్చిమ భాగంలోని ఒక రద్దీ వాణిజ్య ప్రాంతం.ఇది కంప్యూటరు శిక్షణా సంస్థలకు ప్రముఖ కేంద్రం. 90వ దశాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతం ఎక్కువగా ఖాళీ ప్లాట్లతో మరియు బొంబాయి రహదారి NH9 ట్రాఫిక్ తొ ఉండేది. నగరంలో ప్రముఖ ప్రాంతాలలో జరిగిన నిర్మాణ చర్యల కారణంగా హైదరాబాద్ ఉత్తర శివారు విస్తరణ జరిగింది. దాంతో 1990 లో వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడకు మారాయి. నేడు ఈ ప్రాంతం అధికంగా పాదాఛారులతతో మరియు వాహన ట్రాఫిక్తో పాటు అనేక వ్యాపార సంస్థలతో నిండిన సందడి ప్రాంతం. ఈ ప్రాంతంలో రద్దీ గంటల సమయంలో తరచుగా ట్రాఫిక్ జామ్ సంభవిస్తుంటాయి. పాదచారుల వంతెన మరియు శాశ్వతంగా ఏర్పాటు చేసిన రోడ్ డివైడర్లు కారణంగా ట్రాఫిక్ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అమీర్‌పేట కూడలి గ్రీన్ ల్యాండ్ మరియు బేగంపేటలను అనుసంధానిస్తూ జాతీయ రహదారి NH9 ఉంటుంది. అమీర్‌పేట NH9 జాతీయ రహదారిలో పంజగుట్ట మరియు సంజీవరెడ్డినగర్ ప్రాంతాల మధ్య ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=అమీర్‌పేట&oldid=1971934" నుండి వెలికితీశారు