మాచ బొల్లారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాచ బొల్లారం
సమీపప్రాంతం
మాచ బొల్లారం is located in Telangana
మాచ బొల్లారం
మాచ బొల్లారం
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
నిర్దేశాంకాలు: 17°30′52″N 78°30′49″E / 17.51444°N 78.51361°E / 17.51444; 78.51361Coordinates: 17°30′52″N 78°30′49″E / 17.51444°N 78.51361°E / 17.51444; 78.51361
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్
నగరంహైదరాబాదు
విస్తీర్ణం
 • మొత్తం8.36 కి.మీ2 (3.23 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం19,385
 • సాంద్రత2,300/కి.మీ2 (6,000/చ. మై.)
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 010
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

మాచ బొల్లారం, సికింద్రాబాదు జోన్ లోని అల్వాల్ సర్కిల్ లో ఉంది. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ లోని వార్డు నంబరు 133 లో ఉంది.[2]

భౌగోళికం[మార్చు]

మాచ బొల్లారం 17°30′52″N 78°30′49″E / 17.51444°N 78.51361°E / 17.51444; 78.51361 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.

విస్తీర్ణం - జనాభా[మార్చు]

ఇది 8.36 చ.కి.మీ. (3.23 చ.మై.)ల విస్తీర్ణంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఇక్కడ 19,385 జనాభా ఉంది.

సమీప ప్రాంతాలు[మార్చు]

కృష్ణ నగర్ కాలనీ, గోపాల్ నగర్ కాలనీ, అల్వాల్, చంద్ర నగర్ కాలనీ, చేతనా హౌసింగ్ కాలనీ మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతాలు.[3]

రవాణా[మార్చు]

మాచ బొల్లారం ప్రాంతం, కొంపల్లి నుండి 5 కి.మీ., అల్వాల్ నుండి 2 కి.మీ., సికింద్రాబాదు రైల్వే స్టేషను నుండి 10 కి.మీ., బేగంపేట విమానాశ్రయం నుండి 11 కి.మీ., రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 42 కి.మీ.ల దూరంలో ఉంది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మాచ బొల్లారం నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలోని బొల్లారం బజార్ రైల్వే స్టేషను నుండి ఎం.ఎం.టి.ఎస్. రైలు సర్వీసులు కూడా ఉన్నాయి.[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 44. Retrieved 2021-01-18.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-18.
  3. 3.0 3.1 "Machabollaram, Bolarum, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-18.

వెలుపలి లంకెలు[మార్చు]