ఈడి బజార్
ఈడి బజార్ | |
---|---|
పాతబస్తీ | |
Coordinates: 17°20′56″N 78°29′37″E / 17.348918°N 78.493659°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
జోన్ | చంద్రాయణగుట్ట |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500023 |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఈడి బజార్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీకి చెందిన పురాతన మార్కెటు ప్రాంతం.[1] 400 సంవత్సరాల క్రితం నిజాం కాలంలో నిర్మించిన చార్మినార్ వంటి మసీదులు ఇక్కడ ఉన్నాయి.
వాణిజ్య ప్రాంతం
[మార్చు]ఈ ప్రాంతంలో అనేక దుకాణాలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో పెద్ద కూరగాయల మార్కెటు ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో కుమార్వాడి కాలనీ, రీన్ బజార్, మొయిన్ బాగ్, అక్బర్ బాగ్, అలీ నగర్, ఫతేషా నగర్, మహ్మద్ నగర్, రాజానగర్, ఇబ్రహీం కాలనీ, కవేలి కా మకాన్ కాలనీ, రామచంద్ర నగర్, జ్యోతి కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ఇతర ప్రాంతాల నుండి ఈడి బజార్ మీదుగా (చార్మినార్, పిసల్ బండ వరకు) బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడికి సమీపంలోని యాకుత్‌పురాలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది .
ప్రార్థన స్థలాలు
[మార్చు]ఈ ప్రాంతంలో మసీదు-ఎ-అబూబకర్, మసీదు ఇ ఘౌసియా, మసీదు-ఇ-అమీర్ హమ్జా, మసీదు ఫారూక్-ఎ-అజామ్, మసీదు-ఇ-కునైన్ మొదలైనవి, మసీదు ఇ సల్హీన్, మసీదు ఇ హజీరా అహ్లే హదీస్, ఖుబా మసీదు మొదలైన మసీదులు ఉన్నాయి.
దర్గాలు
[మార్చు]ఇక్కడ హజ్రత్ మీర్ షాజుద్దీన్ సహబ్ దర్గా ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Edi Bazaar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.
- ↑ A Guide to the Heritage of Hyderabad. Rupa Publications India Pvt. Ltd. 2010. ISBN 9788129125842. Retrieved 10 October 2014.