యాకుత్‌పురా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యాకుత్‌పురా

పాతబస్తీ, హైదరాబాదు
నగరంలోని ప్రాంతం
యాకుత్‌పురా is located in Telangana
యాకుత్‌పురా
యాకుత్‌పురా
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
యాకుత్‌పురా is located in India
యాకుత్‌పురా
యాకుత్‌పురా
యాకుత్‌పురా (India)
నిర్దేశాంకాలు: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జనాభా
 • మొత్తంసుమారు 6 లక్షలు (6,00,000)
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500023
వాహనాల నమోదు కోడ్టిఎస్
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంయాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

యాకుత్‌పురా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1][2] ఇది పాతబస్తీలో భాగంగా ఉంది.[3]

పద వివరణ[మార్చు]

యాకుత్‌పురా అనే పదం యాకుట్ అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. పర్షియన్ భాషలో యా · కుట్ అంటే విలువైన రాయి "రూబీ" అని అర్థం. హైదరాబాద్ నిజాం రాజు ఈ పేరు పెట్టాడు. హైదరాబాదు ముత్యాల నగరంగా పేరుగాంచింది. 7వ నిజాం (మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్) కాలంలో హైదరాబాదు నగరం రత్నాలు, ముత్యాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందింది. అందులో యాకుత్‌పురా ఒకటి.

వాణిజ్య ప్రాంతం[మార్చు]

ఈ ప్రాంతం, చారిత్రాత్మక చార్మినార్, మక్కా మసీదుల నుండి 2 కి.మీ.ల దూరంలో ఉంది. పాత నగరంలోని అతిపెద్ద ప్రాంతాలలో ఒకటైన యాకుత్‌పురాలో మాదన్నపేట, మీర్ ఆలం మండి వంటి కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. సమీపంలోని లాడ్ బజార్, పత్తర్ గట్టి ప్రాంతాలలో అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. ఇది డబీర్‌పూర్ వంతెన ద్వారా డబీర్‌పూర్ కు కలుపబడివుంది.[4]

యాకుత్‌పురాలోని ప్రాంతాలు[మార్చు]

 1. అజ్మత్ నగర్
 2. అమన్ నగర్
 3. బ్రాహ్మణవాడి (గాంధీ బొమ్మ),
 4. బడా బజార్
 5. భవానీ నగర్
 6. చంద్ర నగర్
 7. తలాబ్ కట్టా
 8. మురాద్ మహల్
 9. జాఫర్ రోడ్
 10. గంగానగర్ (రెహల్ కమాన్)
 11. మాదన్నపేట
 12. ఈడి బజార్
 13. షేక్ ఫైజ్ కమాన్
 14. యాకుత్‌పురా స్టేషన్ రోడ్
 15. బాగ్-ఇ-జహాన్ అరా
 16. ఎస్.ఆర్.టి. కాలనీ
 17. ముర్తుజా నగర్
 18. ఖాసిమ్ కాలనీ
 19. చౌని నాడే అలీ బేగ్
 20. వాహేద్ కాలనీ
 21. దేవ్డి సూర్యార్ జంగ్
 22. అల్ జాబ్రీ కాలనీ
 23. పఠర్ కా మకాన్

సమీప ప్రాంతాలు[మార్చు]

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో యాకుత్‌పురా మీదుగా నగరంలోని వంటి ప్రాంతాలకు బస్సు (బస్సులు నెంబర్లు 82, 77) సౌకర్యం ఉంది.[5] ఇక్కడ యాకుత్‌పురా రైల్వే స్టేషను ఉంది.

ఎంఎంటిఎస్ స్టేషన్

మూలాలు[మార్చు]

 1. "Yakutpura Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
 2. "Yakutpura Colony Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
 3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-30.
 4. "Archive News". The Hindu. Retrieved 2021-01-30.
 5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.