Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

పత్తర్‌గట్టి, హైదరాబాదు

వికీపీడియా నుండి
పత్తర్‌గట్టి బజారు

పత్తర్‌గట్టి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మదీనాలో ఉన్న భవనం. వ్యాపారానికి, నివాసానికి వీలుగా ఉండే ఈ భవనం 1911లో ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మించబడింది.[1]

పత్తర్‌గట్టి మార్కెట్

చరిత్ర

[మార్చు]

చార్మినార్ వెళ్ళేదారిలో మదీనా జంక్షన్ తరువాత ఈ పత్తర్‌గట్టి కాంప్లెక్స్ ఉంది.[2] నగర అభివృద్ధి సంస్థ (సిటీ ఇంప్రూమెంట్ బోర్డు) ఆధ్వర్యంలో 1911లో ఏడవ నిజాం రాజు ఈ భవన నిర్మాణం చేశాడు. పత్తర్‌ అంటే ఉర్దూ భాషలో రాళ్ళు అని అర్థం. పూర్తిగా ఎర్రని గ్రానైట్ రాయితో నిర్మించడం వల్ల దీనిని పత్తర్‌గట్టి అని పిలుస్తారు. ప్రస్తుతం ఇక్కడ ముత్యాల వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.[3]

నిర్మాణం

[మార్చు]

ఇది విలక్షణమైన ఉస్మానియన్ నిర్మాణ శైలిలో ఉన్న రెండంతస్తుల భవనం. దీనిని గట్టి ఎర్రటి గ్రానైట్ తో కట్టడం జరిగింది. కింది అంతస్తులో దుకాణాలు పెట్టుకోవడానికి, పై అంతస్తులో నివాసం ఉండడానికి అనువుగా దీనిని నిర్మించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దీని నిర్మాణానికి డిజైన్ ను అందించాడు.

మూలాలు

[మార్చు]
  1. Times of India, Hyderabad News (23 July 2011). "An Ode to Mir Osman Ali Khan". Mir Ayoob Ali Khan. Archived from the original on 6 April 2019. Retrieved 6 April 2019.
  2. The Hindu, Metro Plus (26 October 2006). "Stay awake and shop". Archived from the original on 6 April 2019. Retrieved 6 April 2019.
  3. పత్తర్‌గట్టి, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 112