Jump to content

మదీనా (హైదరాబాదు)

అక్షాంశ రేఖాంశాలు: 17°22′N 78°30′E / 17.367°N 78.500°E / 17.367; 78.500
వికీపీడియా నుండి
మదీనా
సమీపప్రాంతం
మదీనా భవనం
మదీనా భవనం
మదీనా is located in Telangana
మదీనా
మదీనా
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
మదీనా is located in India
మదీనా
మదీనా
మదీనా (India)
Coordinates: 17°22′N 78°30′E / 17.367°N 78.500°E / 17.367; 78.500
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంగోషామహల్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

మదీనా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇక్కడున్న వక్ఫ్ భవనం, హజ్ యాత్రికులకు సేవ చేయడానికి నిర్మించబడింది.[2]

చరిత్ర

[మార్చు]

సౌదీ అరేబియాలోని హిజాజ్‌లోని ముస్లింలకు పవిత్ర నగరమైన మదీనా నివాసితులకు మద్దతు ఇచ్చే ఉద్దేశంతో ఈ మదీనా భవనం నిర్మించబడింది. నవాబ్ అల్లాదీన్ కుటుంబం దీనికి ప్రధాన కారణం.[3] ఈ భవనంలో సుమారు 200 షాపులు, 100 ఫ్లాట్లు ఉన్నాయి.[4]

సమీపప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో కల్వాగడ్, మదన్ ఖాన్ కాలనీ, ఇంజిన్ బౌలీ, పైమ్ బాగ్, ఫలక్ నుమా, చత్తా బజార్, నాసిర్ కాంప్లెక్స్, నయాపూల్ రోడ్, యూసుఫ్ బజార్, రికాబ్ గుంజ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[5]

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

హైదరాబాదులోని వాణిజ్య శివారు ప్రాంతాలలో ఒకటైన ఈ మదీనా ప్రాంతం చారిత్రాత్మక చార్మినార్కు సమీపంలో ఉంది.[6] ఇది హైదరాబాదులోని ఒక సాంప్రదాయ దుకాణాల జజార్. ఇక్కడికి సమీపంలో పత్తర్‌గట్టి, షెహ్రాన్ బజార్, చార్మినార్, లాడ్ బజార్ మొదలైన ప్రాంతాలలో మహిళలు, వధువు, పిల్లలకు సంబంధించిన దుకాణాలు ఉన్నాయి.[7] ఇక్కడి నుండి పెళ్ళి దుస్తులు ఎక్కువ భాగం పొరుగు రాష్ట్రాలు, యునైటెడ్ స్టేట్స్, ఐరోపా, మిడిల్ ఈస్ట్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాలకు ఎగుమతి చేయబడతాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఈ ప్రాంతం పగలు, రాత్రి అని తేడాల్లేకుండా రద్దీగా ఉంటుంది.[8]

హైదరాబాదీ వంటలును అందించే అనేక రెస్టారెంట్లు (మదీనా హోటల్) ఈ ప్రాంతంలో ఉన్నాయి. పవిత్ర రంజాన్ మాసంలో వడ్డించే హైదరాబాద్ హలీమ్కు ఇక్కడి హోటళ్ళు బాగా ప్రాచుర్యం పొందాయి.

మదీనా హోటల్

[మార్చు]

ఇక్కడున్న మదీనా హోటల్ 1947లో ప్రారంభించబడింది.[9][10]

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మదీనా మీదుగా ఫలక్ నుమా, సఫిల్‌గూడ, బోరబండ, సనత్ నగర్, మెహదీపట్నం, బార్కస్, అఫ్జల్‌గంజ్, జూబ్లీ బస్టాప్, సికింద్రాబాద్ జంక్షన్, రాజేంద్రనగర్, జూ పార్క్, జియాగూడ ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[11] ఇక్కడికి సమీపంలోని యాకుత్‌పురా, మలక్ పేట్ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Madina Colony, Falaknuma Locality". www.onefivenine.com. Retrieved 2021-02-09.
  2. "Waqf". Aug 31, 2018. Retrieved 2021-02-09.
  3. Warren, Frederick Ilchman; Stanley, Nider Katz; Edward, L.Queen (1998). Philanthropy in the World's traditions. Indiana University Press. pp. 294–295. ISBN 0-253-33392-X. Retrieved 2021-02-09.
  4. Staff Reporter (2010-09-07). "Fire at Madina building". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-09.
  5. "Madina Circle Locality". www.onefivenine.com. Retrieved 2021-02-09.
  6. Bollards to go between Madina and Charminar
  7. "Textile traders mull moving out of Hyderabad". The Times of India. 20 June 2013. Retrieved 2021-02-09.
  8. Ramzan sans haleem from Madina Hotel
  9. parasa, Rajeswari (2018-05-17). "Hyderabad: New Madina opens, no resemblance to the past". Deccan Chronicle. Retrieved 2021-02-09.
  10. "Hyderabad: Rahul Gandhi will have a dinner in Madina hotel". The Siasat Daily. 2018-08-04. Retrieved 2021-02-09.
  11. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-09.{{cite web}}: CS1 maint: url-status (link)