మెహదీపట్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెహదీపట్నం
సమీపప్రాంతం
మెహదీపట్నం is located in Telangana
మెహదీపట్నం
మెహదీపట్నం
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
మెహదీపట్నం is located in India
మెహదీపట్నం
మెహదీపట్నం
మెహదీపట్నం (India)
నిర్దేశాంకాలు: 17°23′45″N 78°25′52″E / 17.3959°N 78.4312°E / 17.3959; 78.4312Coordinates: 17°23′45″N 78°25′52″E / 17.3959°N 78.4312°E / 17.3959; 78.4312
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
పేరు వచ్చినవిధంమెహదీ నవాజ్ జంగ్
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 028
వాహన నమోదు కోడ్టిఎస్ 13
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంనాంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

మెహదీపట్నం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇది నగరానికి నైరుతి భాగంలో ఉంది. ఈ ప్రాంతానికి హైదరాబాదు రాష్ట్ర రాజకీయ నాయకుడు, బ్యూరోక్రాట్ మెహదీ నవాజ్ జంగ్ పేరు పెట్టబడింది.[2] ఇది పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే ద్వారా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కలుపబడివుంది. ఇక్కడికి సమీపంలో బంజారా హిల్స్, అమీర్‌పేట్, బేగంపేట, కుకట్‌పల్లి, నాంపల్లి, ముషీరాబాద్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. ఇది గచ్చిబౌలి, మాదాపూర్‌, ఐటి కారిడార్ నుండి 12 కి.మీల దూరంలో ఉంది.

వాణిజ్య ప్రాంతం[మార్చు]

రైతు బజార్ మెహిదిపట్నం

గత రెండు దశాబ్దాలలో ఈ ప్రాంతం భాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అనేక దుకాణాలు ఉండడంవల్ల ఈ ప్రాంతం ఎప్పుడూ జనంతో నిండి ఉంటుంది. తాజా కూరగాయలను కొనడానికి ఇక్కడ రైతు బజార్ (కూరగాయల మార్కెట్) కూడా ఉంది.

బంగారం మార్కెట్[మార్చు]

ఇక్కడ ఓకాజ్ కాంప్లెక్స్ ఉంది. ఇందులో ముజ్తాబా జువెలర్స్,[3] శ్రీకృష్ణ జువెలర్స్, డానిష్ జువెలర్స్ వంటి బంగారు దుకాణాలు ఉన్నాయి.

వీధి వర్తకులు[మార్చు]

మెహదీపట్నంలోని రహదారులపై బొమ్మలు, స్నాక్స్, పాఠ్యపుస్తకాలు, దుస్తులు మొదలైన వస్తువులు విక్రయించే అనేకమంది వీధి వర్తకులు ఉన్నారు.

ఆహారం[మార్చు]

ప్రిన్స్ హోటల్ రెస్టారెంట్, సిటీ డైమండ్ హోటల్, పారడైజ్ హోటల్, అల్ బైక్ షావర్మా సెంటర్, సర్వి బేకర్స్, అనుపమ వంటి అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. సబ్వే, మెక్‌డొనాల్డ్స్, డొమినోస్, కెఎఫ్‌సి, గోలి వాడా పావ్, పిజ్జా హట్ వంటివి కూడా ఉన్నాయి. ఇక్కడున్న స్వాతి టిఫిన్ సెంటర్ చాలా పురాతనమైనది. అనేక ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఈ శివారు ప్రాంతంలోని స్థానిక హోటళ్ళలో హలీమ్‌ను తయారు చేస్తారు.

షాపింగ్ మాల్స్[మార్చు]

సఫా ఆర్కేడ్ కమర్షియల్ కాంప్లెక్స్, ఎస్జిఎం మాల్, చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రోస్, చెన్నై షాపింగ్ మాల్, మాక్స్, మలబార్ జ్యువెలర్స్, పి సత్యనారాయణ అండ్ సన్స్ వంటి అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

కిరాణా[మార్చు]

గృహ అవసారాల కోసం చిన్న దుకాణాలు, రత్నదీప్, మోర్, హెరిటేజ్ ఫ్రెష్, రిలయన్స్ వంటి సూపర్ మార్కెట్లు కూడా ఉన్నాయి.

సినిమా హాళ్ళు[మార్చు]

ఈ ప్రాంతంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు ఉన్నాయి. వాటిల్లో అంబా థియేటర్, ఈశ్వర్ థియేటర్, గెలాక్సీ థియేటర్, ఏషియన్ మల్టీప్లెక్స్ వంటివి ముఖ్యమైనవి.

హాస్పిటల్స్, క్లినిక్స్[మార్చు]

ఈ ప్రాంతంలో సరోజిని దేవి కంటి ఆసుపత్రి, జయభూషణ్ హాస్పిటల్, అనుషా హాస్పిటల్, ఆలివ్ హాస్పిటల్, వాసన్ ఐ కేర్, మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రీమియర్ హాస్పిటల్, ఎంఎం హాస్పిటల్, డాక్టర్ నాయక్ డయాలసిస్ సెంటర్, సమీర్ హాస్పిటల్[4] మొదలైనవి ఉన్నాయి.

రవాణా[మార్చు]

మెహదీపట్నంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో ఉంది. ఇక్కడి నుండి చేవెళ్ళ, మొయినాబాద్‌, ఉప్పల్, సికింద్రాబాద్, లింగంపల్లి, కోఠి, గచ్చిబౌలి, మాదాపూర్‌, అరాంఘర్ వంటి ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[5] ఇక్కడికి సమీపంలో నాంపల్లి, లక్డికాపూల్ ప్రాంతాలలో ఎంఎంటిస్ రైలు స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా స్థలాలు[మార్చు]

 1. మసీదు-ఎ-అజీజియా
 2. ఖాజా గుల్షన్ మసీదు
 3. మసీదు-ఎ-గుంబాద్
 4. కుతుబ్ షాయ్ మసీదు
 5. మసీదు ఇ బాను వా ఫైయాజ్

సమీప ప్రాంతాలు[మార్చు]

 • లక్ష్మీనగర్ కాలనీ
 • హుమాయున్ నగర్
 • కార్వాన్‌
 • జియాగూడ
 • మురద్ నగర్
 • నవోదయ కాలనీ
 • సంతోష్ నగర్ కాలనీ
 • కాంతినగర్ కాలనీ
 • అంబా గార్డెన్స్
 • పద్మనాభ నగర్ కాలనీ
 • విశ్వస్నగర్ కాలనీ
 • అయోధ్యానగర్
 • శారద నగర్
 • గుడిమల్కాపూర్
 • ఎస్బిఐ కాలనీ
 • ఎల్ఐసి కాలనీ
 • జయ నగర్
 • దిల్షాద్ నగర్
 • అత్తాపూర్
 • ఉప్పర్ పట్టి
 • హైదర్‌గూడ

మూలాలు[మార్చు]

 1. "Mehdipatnam Locality". www.onefivenine.com. Retrieved 2021-02-06.
 2. Mehdipatnam bears the brunt of traffic
 3. https://mujtabajewellers.com/
 4. "Dr. Nayak Dialysis Centre". drnayakdialysis.com. Archived from the original on 2020-12-04. Retrieved 2021-02-05.
 5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-06.