మెహదీ నవాజ్ జంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవాబ్ మెహదీ నవాజ్ జంగ్
Nawab Mehdi Nawaz Jung.jpg
1952లో నవాబ్ మెహదీ నవాజ్ జంగ్
జననంసయ్యద్ మెహదీ నవాజ్
(1894-05-23) 1894 మే 23
మరణం1967 జూన్ 28 (1967-06-28)(వయసు 73)
వృత్తిపాలనాధికారి, రాజకీయనాయకుడు

నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ (మే 23, 1894 – జూన్ 28, 1967) హైదరాబాదు రాజ్యంలో పాలనాధికారి, నిజాం ప్రభుత్వపు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క కార్యదర్శి.[1]

ఈయన నివాసము, దేవడీ మెహదీ నవాజ్ జంగ్, హైదరాబాదు మెట్రో అభివృద్ధి సంస్థచే గ్రేడ్-1 వారసత్వ కట్టడంగా పరిగణించబడుతున్నది.[2][3] 1933లో రవీంద్రనాథ్ టాగూర్ హైదరాబాద్‌ను సందర్శించినప్పుడు మూడు నెలలపాటు[4] బంజారాహిల్స్‌లో కొండపైనున్న మెహదీ నవాజ్ జంగ్ ఇళ్లు కోహిస్థాన్‌లో విడిదిచేశాడు. ఈయన ‘కోహిస్థాన్’ అనే పేరుతో ఈ ఇంటి పరిసరాలపై కవిత వ్రాశాడు.[5]

మెహదీ నవాజ్ జంగ్ కేంద్ర లలితకళా, సంగీత నాటక అకాడమీ తొలినాళ్లలో అధ్యక్షుడుగా ఉన్నాడు. హైదరాబాదులో స్థానిక నిర్మల్‌, బిద్రీ కళా వికాసానికి తోడ్పడిన వ్యక్తి.[4]

మెహదీ అసలు పేరు సయ్యద్ మహ్మద్ మెహదీ నవాజ్ జంగ్. ఆయన హైదరాబాదు రాజ్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా నిజాం ఆయనకు నవాబ్ అనే బిరుదు ఇచ్చాడు. అహ్మద్‌నగర్ జిల్లాలో పుట్టిన మెహదీ నవాజ్ జంగ్ ది సంప్రదాయ ముస్లిం కుటుంబం. చిన్నప్పుడే పర్షియన్, అరబిక్ భాషలను నేర్చుకున్న మెహదీ, నిజాం కళాశాల నుంచి పట్టభద్రుడైన వెంటనే హైదరాబాద్ సివిల్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Hyderabad's heritage Rock House razed to set up club". The Times of India. 2011-08-16. Retrieved 2012-04-16. Cite web requires |website= (help)
  2. "HMDA blames GHMC for heritage buildings razing". CNN IBN. 2011-08-17. Retrieved 2012-04-16. Cite web requires |website= (help)
  3. "HMDA halts Banjara Bhavan demolition". The Times of India. 2011-08-17. Retrieved 2012-04-16. Cite web requires |website= (help)
  4. 4.0 4.1 తెలుగు రచయితల ఊసే లేని సాహితీ ఉత్సవం! - ఆంధ్రప్రభ 3 Feb 2014
  5. కవిత్వంలో ‘నగరం’ భావుకతా సాగరం - కొండపల్లి నీహారిణి, ఆంధ్రభూమి 03/02/2014
  6. నవాబ్ బంజారా - నమస్తే తెలంగాణ పత్రిక