ప్రగతి నగర్
ప్రగతి నగర్ | |
---|---|
నివాసప్రాంతం | |
Coordinates: 17°31′16″N 78°23′47″E / 17.5212°N 78.3964°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజిగిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ[1] |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500090 |
టెలిఫోన్ కోడ్ | 91-040 |
Vehicle registration | టిఎస్ 07 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ప్రగతి నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[2] కూకట్‌పల్లికి శివారు ప్రాంతంగా ఉన్న ఈ ప్రగతి నగర్, ముంబై నగరానికి వెళ్ళే 9వ జాతీయ రహదారిలోని కూకట్‌పల్లి ప్రాంతం నుండి 3.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుండి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్‌లో భాగం కావడం, ప్రధాన ఐటి/ఐటిఇఎస్, బయోటెక్, ఫార్మా పరిశ్రమలకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ ఎక్కువమంది నివాసం ఉంటున్నారు.
భౌగోళికం
[మార్చు]ఇది 9వ జాతీయ రహదారికి తూర్పువైపు ఉంది. సముద్రమట్టానికి 33 మీటర్లు (108 అడుగులు) ఎత్తులో ఉంది. 9వ జాతీయ రహదారికి పశ్చిమంవైపు ఉన్న నిజాంపేటకు 3 కిలోమీటర్లు (4.8 మైళ్ళ) దూరంలో ఉంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత జనవరి నెలలో 35 °C ఉండగా, జూలై నెలలో 38 °C ఉంటుంది.[3]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో వసంతనగర్ కాలనీ, ఆదిత్య హిల్స్, నిజాంపేట, మిథిలా నగర్, బ్లాక్ -7ఎ, జె.ఎన్.టి.యు., సాయినగర్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
ప్రార్థనా స్థలాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో కనకదుర్గ దేవాలయం, షిర్డీ సాయిబాబా దేవాలయం, మసీదు రహమానియా, జామియా మస్జిద్ ఉస్మానియా, ఎన్టీఆర్ కాలనీ మసీదు మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి నగర్ మీదుగా సాయినగర్ కాలనీ, నిజాంపేట్, కూకట్‌పల్లి మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Language in India". www.languageinindia.com. Retrieved 2021-02-02.
- ↑ "Pragathi Nagar Road, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-02-02.
- ↑ "Weather Information for Pragathi Nagar". The Weather Channel. Retrieved 2021-02-02.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-02.