బాగ్ లింగంపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాగ్ లింగంపల్లి
సమీప ప్రాంతాలు
బాగ్ లింగంపల్లి is located in Telangana
బాగ్ లింగంపల్లి
బాగ్ లింగంపల్లి
Location in Telangana, India
బాగ్ లింగంపల్లి is located in India
బాగ్ లింగంపల్లి
బాగ్ లింగంపల్లి
బాగ్ లింగంపల్లి (India)
నిర్దేశాంకాలు: 17°23′57″N 78°29′51″E / 17.39918°N 78.49757°E / 17.39918; 78.49757Coordinates: 17°23′57″N 78°29′51″E / 17.39918°N 78.49757°E / 17.39918; 78.49757
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
500044
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటి.ఎస్
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంహిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

బాగ్ లింగంపల్లి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదు నగరంలోని ప్రముఖ ప్రాంతాలలో ఒకటైన ఈ బాగ్ లింగంపల్లి ప్రాంతం వ్యాపారాలకు, నివాసానికి అత్యంత ప్రముఖమైన ప్రాంతంగా ప్రసిద్ధిచెందింది. నవాబులకు నివాసంగా ఉన్న ఈ ప్రాంతంలో పండ్ల తోటలు ఉండడం వల్ల దీనికి 'బాగ్' అని, పక్కనే ఉన్న లింగంపల్లిలోవున్న ట్యాంకులలో రాణులు స్నానం చేసేవారు. ఆర్.టి.సి. క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, బర్కత్‌పురా, హిమాయత్, నల్లకుంట, కోఠి మొదలైన ప్రాంతాలకు సమీపంలో ఉంటుంది.

వాణిజ్యం[మార్చు]

బాగ్ లింగంపల్లిలో అనేక చాట్ బండార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, టీ స్టాల్స్, పాన్ షాప్స్, జ్యూస్ సెంటర్స్, రెస్టారెంట్లు ఎక్కువగా ఉన్నాయి.

రవాణా[మార్చు]

బాగ్ లింగంపల్లి నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది. ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. దీనికి దగ్గరలో కాచిగూడ రైల్వేస్టేషను, విద్యానగర్ రైల్వే స్టేషను లు ఉన్నాయి.

విద్యాసంస్థలు[మార్చు]

ఈ డివిజనులో డా. బిఆర్‌ అంబేడ్కర్‌ విద్యాసంస్థల పరిధిలో పది, ఇంటర్‌, డిగ్రీ, ఎంబీఏ కళాశాలలు, లా అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ కళాశాల, నారాయణ జూనియర్ కళాశాల, సెయింట్ గాబ్రియల్స్ స్కూల్, గౌతం మోడల్ స్కూల్ వంటి ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి.[1]

సుందరయ్ విజ్ఞాన కేంద్రం

సాంస్కృతిక కేంద్రం[మార్చు]

ఇక్కడ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ సాయిబాబా ఆలయం, సుందరయ్య ఉద్యానవనం ఉన్నాయి. వివిధ కార్యక్రమాల నిర్వహణకు సుందరయ్య విజ్ఞాన కేంద్రము కూడా ఉంది.

రహదారులు[మార్చు]

ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రహదారి ఉంది. 426 కోట్ల రూపాయల అంచనాతో ఇందిరా పార్కు - వి.ఎస్.టి. మధ్య స్టీల్ వంతెనను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బాగ్‌లింగంపల్లి, వి.ఎస్.టి. జంక్షన్ల మధ్య ఎక్కేందుకు ర్యాంపు ఏర్పాటుచేయబోతున్నారు.[2]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, ముషీరాబాద్‌ నియోజకవర్గం. "కళాశాలలు". Archived from the original on 15 అక్టోబరు 2016. Retrieved 8 June 2018.
  2. టీన్యూస్ (5 January 2018). "భాగ్యనగరంలో స్టీల్‌ వంతెనలు". Retrieved 8 June 2018.[permanent dead link]