చాంద్రాయణగుట్ట
చాంద్రాయణ గుట్ట (చెన్నరాయుని గుట్ట),[1] హైదరాబాదు నగర దక్షిణ భాగంలో ఉన్న ఒక పేట.[2] ఒక పక్క నేషనల్ పోలీస్ అకాడెమీ, మరో పక్క రక్షణ శాఖ వారి కచేరీలు, దక్షిణాన కేంద్ర ప్రభుత్వ పోలీస్ శాఖ వారి ప్రధాన కార్యాలయంతో కూడుకున్న ఈ ప్రదేశం దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సంబంధిత వ్యక్తుల నివాసాలకు నెలవు. 2022 ఆగస్టు 27న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చేతులమీదుగా ఇక్కడ చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభించబడింది.[3]
ముఖ్యమయిన బస్తీలు
[మార్చు]ఈ పేటలోని ముఖ్యమయిన బస్తీలు :
|
|
|
ఈ ప్రదేశానికి ఉత్తరంగా ఫలక్నామా, దక్షిణంగా పహాడీ షరీఫ్, తూర్పువైపుకి సంతోష్ నగర్ (కంచన్ బాగ్), పడమరకు శివరాంపల్లి ఉన్నాయి. ఈ ప్రదేశం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషను పరిధిలో ఉంది. సౌత్ డివిజన్, ఫలక్నుమా జోన్ కింద వస్తుంది. రెవెన్యూ ప్రకారం బండ్లగూడ మండలం కింద వస్తుంది.
ముఖ్యమయిన ప్రదేశాలు
[మార్చు]- చెన్నకేశవస్వామి ఆలయం, కేశవగిరి
- రామలింగేశ్వర స్వామి-గుట్ట మల్లేశ్వర స్వామి ఆలయం, కేశవగిరి
- దేవీ దేవాలయం, కుమ్మర బస్తీ
- పూరీ జగన్నాథ్ మఠం
- ఏకనాథ్ స్వామి దేవాలయం
- సీఅర్‍పీఎఫ్ క్యాంపస్
- పీలీ దర్గా
విద్యా సంస్థలు
[మార్చు]ఈ పేటలో ఉన్న విద్యా సంస్థలు:
- కేంద్రీయ విద్యాలయం, సీఆర్పీఎఫ్
- కేంద్రీయ విద్యాలయం, కంచన్‌బాగ్
- మొగల్ ఇంజనీరింగ్ కాలేజీ
- గ్రీన్ ఫోర్ట్ ఇంజనీరింగ్ కళాశాల
- మహావీర్ ఇంజనీరింగ్ కళాశాల
- డెక్కన్ మెడికల్ కళాశాల
- ప్రభుత్వ పాఠశాలలు
విశేషాలు
[మార్చు]నిజాం కాలం నాటి బస్తీలు. నేటికీ అరబ్బుల రాకపోకలు. అరబ్ వంటాకాల కొలువులు.
మూలాలు
[మార్చు]- ↑ దక్కన్ లాండ్, హైదరాబాదు (1 October 2020). "పట్నంలో షాలిబండా". www.deccanland.com. పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 14 January 2021. Retrieved 14 January 2021.
- ↑ Chandrayangutta PS Archived 5 ఏప్రిల్ 2015 at the Wayback Machine
- ↑ Namasthe Telangana (27 August 2022). "చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.