మేడ్చల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేడ్చల్
—  రెవెన్యూ గ్రామం  —
మేడ్చల్ రైలు స్టేషన్
మేడ్చల్ రైలు స్టేషన్
మేడ్చల్ is located in తెలంగాణ
మేడ్చల్
మేడ్చల్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°38′01″N 78°29′22″E / 17.633603°N 78.489419°E / 17.633603; 78.489419
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ జిల్లా
మండలం మేడ్చల్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 93,425
 - పురుషుల సంఖ్య 47,465
 - స్త్రీల సంఖ్య 45,960
పిన్ కోడ్ 501401
ఎస్.టి.డి కోడ్

మేడ్చల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలానికి చెందిన గ్రామం,[1] ఇది హైదరాబాదును ఆనుకొని 44 వ నెంబరు జాతీయ రహదారి పై నాగపూర్ మార్గంలో ఉంది. కిష్టాపూర్ గ్రామం మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో వస్తుంది. 2013, సెప్టెంబరు 16న మేడ్చల్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2] పూర్వం ఈ గ్రామాన్ని "మేడిచెలం" అనేవారు.

విశేషాలు[మార్చు]

ఈ వూరికి సమీపంలో పచ్చని ప్రకృతి అందాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో, శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, చూడముచ్చటగా విరాజిల్లుతోంది.ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శరన్నవరాత్రులలో స్వామివారికి ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.[3]

చరిత్ర[మార్చు]

1830లో గ్రామ స్థితిగతులను యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో వ్రాసుకున్నారు.1830 నాటికి మేడ్చల్‌కు హైదరాబాద్ నగరం నుంచి చేరేందుకున్న దారి చాలా అనుకూలంగా ఉండేది. బాటలో ఇసుక పొర ఉండేది. బాట పక్కన సీతాఫలపు చెట్ల అడవి మనోహరంగా ఉండేది. గ్రామానికి ముందున్న రెండు వాగులను దాటి ఊరికి చేరాల్సివుంటుందని, వర్షాకాలంలో అయితే వాగులు ఉధృతిగా ఉన్నప్పుడు దాటేందుకు కనీసం ఒకటి రెండు రోజులైనా ఆగవలసివుంటుందని వ్రాశారు. అప్పటికే గ్రామంలో కావలసిన వస్తువులన్న దొరికే వీలుందని, అంగళ్ళు చాలానే ఉన్నాయని వీరాస్వామయ్య వ్రాశారు.[4]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 93,425 - పురుషులు 47,465 - స్త్రీలు 45,960

రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామంలో రైల్వే స్టేషను ఉంది. ప్రధాన రైల్వే స్టేషను సికింద్రాబాదు ఇక్కడికి 24 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడినుండి అన్ని ప్రాంతాలకు రోడ్డు సౌకర్యముండి, బస్సుల వసతి ఉంది.

బ్యాంకులు[మార్చు]

ఈ గ్రామంలో ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారి శాఖలు ఉన్నాయి.

విద్యా సంస్థలు[మార్చు]

రెడ్ సన్ జూనియర్, కళాశాల, సిల్వర్ జూనియర్ కళాశాల, స్కాలర్స్ జూనియర్ కళాశాల, గౌతమి డిగ్రీ కళాశాల, (ఫాఠశాలలు) డి.ఆర్.ఎస్. ఇంటర్ నేషనల్ స్కూలు, గౌతమి మోడల్ స్కూలు, కింగ్స్ విక్టర్ గ్రామర్ హైస్కూలు, శ్రీ చైతన్య హైస్కూలు, నాగార్జున టేలెంట్ స్కూలు, కృష్ణవేణి టేలెంట్ స్కూలు, ఆక్స్ ఫర్డ్ టేలెంట్ స్కూలు ఉన్నాయి.

ఉపగ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి చాల ఉప గ్రామాలున్నవి. వాటిలో కొన్ని. అర్కలగూడ, బ్రహ్మాజీగూడ, బాసిర గడి ఘన్ పూర్, గోసాయి గూడ, గుబ్బడి తండ, ఖాసింబాయి తండ, ఖాజీగూడ, మైసిరెడ్డి పల్లె, మురహరి పల్లె, మురారిపల్లి, మైసమ్మగూడ, రాజ్ బొల్లారం తండ, రామలింగేశ్వర నగర్, సీతారి గూడ, సహజాదిగూడ, మొదలగునవి.[5]

మినీ స్టేడియం[మార్చు]

మేడ్చల్‌ పట్టణంలో 1.80 కోట్ల రూపాయలతో 8 ఎకరాల్లో నిర్మించిన మినీ స్టేడియాన్ని 2022 జూన్ 15న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కలెక్టర్‌ హరీశ్‌ జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయానందరెడ్డి పాల్గొన్నారు.[6]

ఎంసీహెచ్ ఆసుపత్రి[మార్చు]

మేడ్చల్‌ పట్టణంలో నిర్మిస్తున్న 50 పడకల ఎంసీహెచ్ దవాఖానకు 2022 ఆగస్టు 3న రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ దవాఖానకు కొత్తగా ఎనిమిది మంది వైద్యులు, 16 మంది స్టాఫ్‌నర్సులతోపాటు 50 మంది సిబ్బంది అదనంగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి సిహెచ్. మల్లారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Medchal Municipality". Retrieved 2 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. ఈనాడు జిల్లా ఎడిషన్, 17-8-2013. 13వ పేజీ.
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  5. http://www.onefivenine.com/india/villag/Rangareddi/Medchal
  6. telugu, NT News (2022-06-16). "క్రీడా ప్రాంగణాలతో కొత్త ఉత్సాహం". Namasthe Telangana. Archived from the original on 2022-06-16. Retrieved 2022-06-16.
  7. telugu, NT News (2022-08-03). "ఎయిమ్స్‌ పరువు తీస్తున్నరు.. కేంద్రంపై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-08-03. Retrieved 2022-08-03.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మేడ్చల్&oldid=3876169" నుండి వెలికితీశారు