హైదర్‌గూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదర్‌గూడ
నగరంలోని ప్రాంతం
అపోలో హాస్పిటల్
అపోలో హాస్పిటల్
హైదర్‌గూడ is located in Telangana
హైదర్‌గూడ
హైదర్‌గూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
హైదర్‌గూడ is located in India
హైదర్‌గూడ
హైదర్‌గూడ
హైదర్‌గూడ (India)
నిర్దేశాంకాలు: 17°23′47″N 78°28′54″E / 17.39639°N 78.48167°E / 17.39639; 78.48167Coordinates: 17°23′47″N 78°28′54″E / 17.39639°N 78.48167°E / 17.39639; 78.48167
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్ జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 029
వాహనాల నమోదు కోడ్టి.ఎస్
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

హైదర్‌గూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదులో పేరొందిన వాణిజ్య, నివాస ప్రాంతాలలో ఇదీ ఒకటి. ఓల్డ్ ఎమ్మెల్యే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో విట్టల్ వాడి, రామ్‌కోటి, గన్ ఫౌండ్రి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

వాణిజ్య ప్రాంతం[మార్చు]

ఇక్కడ ఫుడ్ వరల్డ్, పాంటలూన్స్, మోర్ వంటి అనేక మాల్స్, దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకులు ఉన్నాయి. హైదరాబాదీ రెస్టారెంట్ కేఫ్ బహార్ కూడా ఇక్కడ ఉంది.

విద్యాసంస్థలు[మార్చు]

భారతీయ విద్యా భవన్‌ శాఖ, సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పిజి కళాశాల,హైదరాబాద్ సెయింట్ పాల్స్ హైస్కూల్, లోటస్ నేషనల్ స్కూల్ వంటి విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి.[2] 1990లలో ఇక్కడ మదీనా హైస్కూల్, మదీనా స్టూడెంట్స్ హాస్టల్ బాగా ప్రాచుర్యం పొందాయి. హాస్టల్ ను మదీనా ఐ హాస్పిటల్ గా మార్చారు.

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హైదర్‌గూడ నుండి నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] సమీపంలోని నాంపల్లిలో ఎంఎంటిఎస్ రైలు సౌకర్యం ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Hyderguda , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-27.
  2. "Lotus National School, Hyderguda". The Hindu. 2006-02-17. ISSN 0971-751X. Retrieved 2021-01-27.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-27.

ఇతర లంకెలు[మార్చు]