సింధీ కాలనీ
సింధీ కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
నిర్దేశాంకాలు: 17°28′N 78°31′E / 17.467°N 78.517°ECoordinates: 17°28′N 78°31′E / 17.467°N 78.517°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
ప్రభుత్వం | |
• నిర్వహణ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
కాలమానం | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 015 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | టిఎస్ |
లోకసభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
జాలస్థలి | telangana |
సింధీ కాలనీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రాంతం.[1] ఇది సికింద్రాబాదుకు ప్రధాన శివారు ప్రాంతంగా ఉంది. 1947లో భారత విభజన తరువాత పాకిస్తాన్‌లో భాగమైన సింధ్ నుండి వచ్చిన శరణార్థ సింధీ ప్రజలను ఉంచడానికి ఇది ఏర్పాటుచబడింది. ఇది హైదరాబాదు నగరానికి ఉత్తర దిశలో ఉంది.
చరిత్ర[మార్చు]
ఇక్కడ సింధీ కాలనీని నిర్మించటానికి ముందు, హుస్సేన్ సాగర్ సరస్సు వెనుక వైపు ఉన్న ప్రాంతాలు అదనపు నీటిని కలిగి ఉన్నాయి. ఇక్కడి మొదటి ఆనకట్టను 1946లో మైఖేల్ బేక్స్ నిర్మించాడు.
సమీప ప్రాంతాలు[మార్చు]
ఇక్కడికి సమాపంలో జోఘని, ప్రేందర్‌ఘాస్ట్ రోడ్, పైగా కాలనీ, గన్ బజార్, మినిస్టర్ రోడ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్య ప్రాంతం[మార్చు]
దీనికి శివారులో అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. 2002లో అనేక వస్త్ర పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు ఇక్కడ షాపింగ్ చేయడానికి వస్తారు.
ప్రార్థనా స్థలాలు[మార్చు]
ఇక్కడికి సమీపంలో కనకదుర్గ దేవాలయం, హనుమాన్ దేవాలయం, సాయిబాబా దేవాలయం, బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరం, షియా ఇమామి ఇస్మాయిలీ జమత్ఖానా, జమత్ఖానా, మసీదు ఇ నజీరియా మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.
రవాణా[మార్చు]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సింధీ కాలనీ మీదుగా సికింద్రాబాద్, సనత్‌నగర్, ఆల్విన్ కాలనీ, భరత్ నగర్, బోరబండ, కొండపూర్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[2]
మూలాలు[మార్చు]
- ↑ "Sindhi Colony , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-31.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.