Jump to content

సింధీ ప్రజలు

వికీపీడియా నుండి

Sindhi
سنڌي / सिन्धी /
Total population
సుమారు 39 million[ఆధారం చూపాలి]
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 Pakistan2,95,00,000[1]
 India2,772,264[2]
 United Arab Emirates341,000[ఆధారం చూపాలి]
 Malaysia30,500[ఆధారం చూపాలి]
 United Kingdom30,000[ఆధారం చూపాలి]
 Canada11,500[ఆధారం చూపాలి]
 Indonesia10,000[ఆధారం చూపాలి]
 United States9,801[ఆధారం చూపాలి]
 Singapore8,800[ఆధారం చూపాలి]
 Hong Kong7,500[3]
 Oman700[ఆధారం చూపాలి]
భాషలు
Sindhi
మతం
Majority: Islam
Minority: Hinduism and Sikhism

సింధీలు (సిర్ది: (పర్సో-అరబికు మాట్లాడే ప్రజలు) ప్రజలను सिन्धी (దేవనాగరి), సింధి ఖుదాబాది అని కూడా పిలుస్తారు. స్విజి (ఖుదాబాది)) సింధీ భాష మాట్లాడే ఇండో-ఆర్య జాతి-భాషా సమూహం. వీరు పాకిస్తాను సింధు ప్రావిన్సుకు చెందినవారు. 1947 లో భారతదేశ విభజన తరువాత చాలా మంది సింధి హిందువులు, సింధి సిక్కులు కొత్తగా ఏర్పడిన " డొమినియను ఆఫ్ ఇండియా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. ప్రస్తుతం సంప్రదాయ సింధీలు భారతదేశం, పాకిస్తాన్లలో ఉన్నారు. భారతీయ సింధీలు ప్రధానంగా హిందువులుకాగా, పాకిస్తాను సింధీలు ప్రధానంగా ముస్లింలు.

సింధి ముస్లిం సంస్కృతి సూఫీ సిద్ధాంతాలు, సూత్రాలతో అధికంగా ప్రభావితమైంది.[4] ప్రసిద్ధ సాంస్కృతిక సింధీలలో షా అబ్దులు లతీఫు భితాయి, లాల్ షాబాజు ఖలందరు, జులేలాలు, సచలు సర్మాస్టు ప్రాధాన్యత వహిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

చరిత్రపూర్వ కాలం

[మార్చు]
Vintage group photo of Indian Sindhi people

సింధు లోయ నాగరికత క్రీ.పూ 1700 సంవత్సరంలో పూర్తిగా తెలియని కారణాల వల్ల క్షీణించింది. అయినప్పటికీ దాని పతనం బహుశా భూకంపం లేదా ఘగ్గరు నదిని ఎండడం వంటి సహజ సంఘటన ద్వారా సంభవించింది. క్రీస్తుపూర్వం 1500 లో సరస్వతి నది, గంగా నది మధ్య ఉన్న వేద నాగరికతను ఇండో-ఆర్యులు స్థాపించారని విశ్వసిస్తున్నారు. ఈ నాగరికత దక్షిణ ఆసియాలో తదుపరి సంస్కృతులను రూపొందించడానికి సహాయపడింది.

చరిత్రాత్మక కాలం

[మార్చు]

మొదటి సహస్రాబ్దిలో అనేక శతాబ్దాలుగా క్రీ.పూ మొదటి సహస్రాబ్ది మొదటి ఐదు శతాబ్దాలలో సింధు పశ్చిమ భాగాలు, సింధు నది, పశ్చిమ పార్శ్వంలో ఉన్న ప్రాంతాలు పర్షియా, గ్రీకు, కుషాను పాలనలో అడపాదడపా ఉన్నాయి.[ఆధారం చూపాలి] అచెమెనిదు రాజవంశం (క్రీ.పూ 500- క్రీ.పూ -300), ఇది తూర్పున సాత్రపీలు, తరువాత అలెగ్జాండరు ది గ్రేట్ తరువాత ఇండో-గ్రీకులు, తరువాత ఇండో-సస్సానిదులు, అలాగే కుషాన్ల ఆధ్వర్యంలో, 7 వ మధ్య ఇస్లామికు దండయాత్రలకు ముందు –10 వ శతాబ్దం సా.శ. అలెగ్జాండరు ది గ్రేట్ పర్షియా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత సింధు నదీతీరం వెంట పంజాబు, సింధు గుండా వెళ్ళాడు.

అరబ్బులచేత జయించబడిన మొదటి ప్రాంతాలలో సింధు ఒకటి. అలాగే ఇస్లాం చేత ప్రభావితమైన మొదటి ప్రాంతంగా ఇది గుర్తించబడుతుంది.[5]

సా.శ. 720 తరువాత అరబ్బులు స్వాధీనం చేసుకున్న తరువాత ఇస్లాం చేత ప్రభావితమైన తొలి ప్రాంతాలలో సింధు ఒకటి. ఈ కాలానికి ముందు, ఇది భారీగా హిందూ, బౌద్ధమత ప్రభావితంగా ఉండేది. సా.శ. 632 తరువాత ఇది అబ్బాసిదులు, ఉమైయిదుల ఇస్లాం సామ్రాజ్యాలలో భాగంగా ఉంది. హబ్బరి, సూమ్రా, సమ్మ, అర్ఘును రాజవంశాలు సింధును పాలించాయి.

సంప్రదాయం, మతం

[మార్చు]
"The Priest King Wearing Sindhi Ajruk", c. 2500 BC, in the National Museum of Pakistan.

ఈ ప్రాంతానికి సింధు (సింధు) పేరు పెట్టారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను సింధి అని పిలుస్తారు. సింధు అనే పదం నుండి హిందీ, హిందూ పదాలు ఉద్భవించాయి. ఎందుకంటే ప్రాచీన పర్షియన్లు "స"ను "హ" (ఉదా., సరస్వతి హరవతి) అని ఉచ్చరించారు. అదే విధంగా పర్షియన్లు ఈ ప్రాంత ప్రజలను హిందూ ప్రజలు అని, వారి భాషను హిందీ భాష అని, ఈ ప్రాంతాన్ని హిందు అని పిలిచారు. ఈ పేరు పురాతన కాలం నుండి ఈ ప్రాంతానికి, తరువాత మొత్తం ఉత్తర భాగానికి ఉపయోగించబడింది. ఈ రోజు ద్వీపక్లం అంతటికీ ఇది ఆపాదించబడింది.

రోరు రాజవంశం భారత ఉపఖండం నుండి వచ్చిన శక్తి. ఇది క్రీస్తుపూర్వం 450 - సా.శ. 489 నుండి ఆధునిక సింధు వాయవ్య భారతదేశాన్ని పాలించింది.[6] సింధు రెండు ప్రధాన, అత్యున్నత తెగలు సా.శ. 970–1351 కాలంలో సింధును పాలించిన సూమ్రో రాజవంశం వారసులు - సా.శ. 1351–1521 కాలంలో సింధును పాలించిన సమ్మ రాజవంశం వారసులు - ఈ తెగలకు చెందినవి అదే రక్తసంబంధం కలిగిన ప్రజలుగా ఉన్నారు. ఇతర సింధీ రాజ్పుతులలో భచోలు, భుట్టోలు, భట్టిలు, భన్బ్రోలు, మహేన్డ్రోలు, బురిరోలు, లఖా, సహేతాలు, లోహనాలు, మోహనో, దహార్లు, ఇందారు, చాచారు, ధరేజా, రాథోరెలు, దఖాను, లంగా, మొదలైనవి సింధీ-సిపాహి గుజరాతుకు చెందిన సంధై ముస్లింలు భారతదేశంలో స్థిరపడిన సింధీ రాజ్పుతుల వర్గాలు ఉన్నాయి. సింధీ రాజ్పుతులతో దగ్గరి సంబంధం ఉన్న సింధు జాట్లు, వీరు ప్రధానంగా సింధు డెల్టా ప్రాంతంలో కనిపిస్తారు. ఏదేమైనా పంజాబు, బలూచిస్తాన్లతో పోలిస్తే సింధులో గిరిజనులకు పెద్ద ప్రాముఖ్యత లేదు. సింధులో గుర్తింపు ఎక్కువగా ఒక ఉమ్మడి జాతి గుర్తింపు మీద ఆధారపడి ఉంటుంది.[7]

సింధీ ముస్లిములు

[మార్చు]
పాకిస్థాని సింధీ గాయని " అదిదా పర్వీను " అలాగే సుఫీ సంగీత గాయకురాలు

సింధు ప్రజల స్థిరమైన శ్రేయస్సు, దాని వ్యూహాత్మక భౌగోళిక స్థితితో కారణంగా విదేశీ సామ్రాజ్యాల వరుస విజయాలకు లోబడి ఉంది. సా.శ. 712 లో సింధు ఇస్లామికు సామ్రాజ్యమైన కాలిఫేటులో విలీనం చేయబడింది. భారతదేశంలోకి ‘అరేబియా ద్వారం’ అయింది (తరువాత ఇస్లాం ద్వారం బాబు-ఉల్-ఇస్లాం అని పిలువబడింది).

ముస్లిం సింధీలు సున్నీ హనాఫీ ఫిఖ్ను అనుసరిస్తున్నారు. వీరిలో గణనీయమైన అల్పసంఖ్యాక షియా ఇత్నా 'అషరియా ఉన్నారు. సింధి ముస్లింల మీద సూఫీ మతం తీవ్ర ప్రభావాన్ని చూపింది. సింధు ప్రాంతం అంతటా కలిపించే అనేక సూఫీ మందిరాల ద్వారా ఇది కనిపిస్తుంది.

సింధి హిందువులు

[మార్చు]

ఇస్లాం ఆక్రమణకు ముందు సింధులో హిందూ మతం ప్రధానమైన మతం. పాకిస్తాను 1998 జనాభా లెక్కల ఆధారంగా సింధు భూభాగం మొత్తం జనాభాలో హిందువులు 8% ఉన్నారు.[8] వీరిలో ఎక్కువ మంది కరాచీ, హైదరాబాదు, సుక్కూరు, మీర్పూరు ఖాసు వంటి పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. పాకిస్తానులోని సింధి హిందువుల అతిపెద్ద కేంద్రం హైదరాబాదు అక్కడ 100,000-150,000 మంది నివసిస్తున్నారు.[8] 1947 లో పాకిస్తాను స్వాతంత్ర్యానికి ముందు హిందువుల నిష్పత్తి ఎక్కువగా ఉంది.[9]

"1947 కి ముందు కరాచీలో నివసిస్తున్న కొద్దిమంది గుజరాతీ మాట్లాడే పార్సీలు (జొరాస్ట్రియన్లు) కాకుండా, పాకిస్తాను స్వాతంత్ర్యం సమయంలో ముస్లిం లేదా హిందువు అయినా, నివాసితులందరూ సింధిలే, జనాభాలో 75% ముస్లింలు, మిగిలిన 25 % మంది హిందువులు.[10]

సింధ్‌లోని హిందువులు 1947 లో పాకిస్తాను ఏర్పడటానికి ముందు నగరాలలో కేంద్రీకృతమై ఉన్నారు. ఈ సమయంలో అహ్మదు హసను డాని అభిప్రాయం ఆధారంగా చాలామంది భారతదేశానికి వలస వచ్చారు. సింధు భూభాగంలో హిందువులు కూడా వ్యాపించారు. తారి (సింధీ మాండలికం) పాకిస్తానులోని సింధు, భారతదేశంలో రాజస్థానులో మాట్లాడతారు.

"సింధు నగరాలు, పట్టణాలు హిందువుల ఆధిపత్యం. ఉదాహరణకు 1941 లో మొత్తం పట్టణ జనాభాలో హిందువులు 64% ఉన్నారు.[11]

విదేశీ ఉపాధిదారులు

[మార్చు]

భారతదేశం, పాకిస్తాను నుండి వలస వెళ్ళిన సింధీ ప్రవాసులు పలుదేశాలలో ఉపాధిదారులుగా ఉన్నారు. సింధు నుండి వలసలు 19 వ శతాబ్దానికి ముందు నుండి ప్రారంభమై తరువాత కూడా కొనసాగాయి. చాలా మంది సింధీలు ఐరోపా, యునైటెడు స్టేట్సు, కెనడా దేశాలలొ ఉపాధి వెతుక్కుని పని చేస్తున్నారు. అలాగే పెద్ద సింధి జనాభా యునైటెడ్ అరబ్ ఎమిరేట్సు, సౌదీ అరేబియా వంటి మధ్యప్రాచ్య రాష్ట్రాలో కూడా స్థిరపడ్డారు.

సంస్కృతి

[మార్చు]

సింధి పేర్లు

[మార్చు]

ముస్లిం సింధీ సాంప్రదాయ ముస్లిం మొదటి పేర్లను కలిగి ఉంటుంది. కొన్నిసార్లు స్థానికీకరించిన వైవిధ్యాలతో ఉంటుంది. సింధికి వారి వృత్తులు, పూర్వీకుల స్థానాల ఆధారంగా కులాలు ఉన్నాయి.

సింధి హిందువులకు ఇంటిపేర్లు '-అని' ('అన్షి' వైవిధ్యం, సంస్కృత పదం 'అన్షా' నుండి ఉద్భవించింది. దీని అర్థం 'సంతతి నుండి వచ్చినది'). సింధి హిందూ ఇంటిపేరు మొదటి భాగం సాధారణంగా పూర్వీకుల పేరు లేదా స్థానం నుండి తీసుకోబడింది. ఉత్తర సింధులో 'జా' తో ముగిసే ఇంటిపేర్లు (అంటే 'యొక్క') కూడా సాధారణం. ఒక వ్యక్తి ఇంటిపేరు ఆయన లేదా ఆమె స్థానిక గ్రామం పేరును కలిగి ఉంటుంది. తరువాత 'జా' ఉంటుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. CCI to consider releasing census results without 5pc audit Dawn News.
  2. "Scheduled Languages in descending order of speaker's strength – 2011" (PDF). Registrar General and Census Commissioner of India. 29 జూన్ 2018.
  3. Kesavapany, K.; Mani, A.; Ramasamy, P. (1 జనవరి 2008). "Rising India and Indian Communities in East Asia". Institute of Southeast Asian Studies – via Google Books.
  4. Ansari, Sarah FD. Sufi saints and state power: the pirs of Sind, 1843–1947. No. 50. Cambridge University Press, 1992.
  5. Nicholas F. Gier, FROM MONGOLS TO MUGHALS: RELIGIOUS VIOLENCE IN INDIA 9TH-18TH CENTURIES, presented at the Pacific Northwest Regional Meeting American Academy of Religion, Gonzaga University, May 2006 [1]
  6. Kessler, P L. "Kingdoms of South Asia – Kingdoms of the Indus / Sindh". www.historyfiles.co.uk (in ఇంగ్లీష్). Retrieved 15 ఫిబ్రవరి 2018.
  7. "The People and the land of Sindh". Archived from the original on 5 నవంబరు 2010. Retrieved 26 డిసెంబరు 2019.
  8. 8.0 8.1 "Pakistan Census Data". Archived from the original (PDF) on 26 డిసెంబరు 2018. Retrieved 26 డిసెంబరు 2019.
  9. "Partition and the 'other' Sindhi".
  10. The foreign policy of Pakistan: ethnic impacts on diplomacy, 1971–1994, by Mehtab Ali Shah, published in 1997 by I B Tauris and Co Ltd, London PAGE 46
  11. Proceedings of the First Congress of Pakistan History & Culture held at the University of Islamabad, April 1973, Volume 1, University of Islamabad Press, 1975

వనరులు

[మార్చు]
  • Bherumal Mahirchand Advani, "Amilan-jo-Ahwal" – published in Sindhi, 1919
  • Amilan-jo-Ahwal (1919) – translated into English in 2016 ("A History of the Amils") at sindhis

వెలుపలి లింకులు

[మార్చు]

మూస:Ethnic groups in Pakistan మూస:Sindh topics మూస:Sindhi nationalism