నవాబ్ సాహెబ్ కుంట
నవాబ్ సాహెబ్ కుంట | |
---|---|
పాతబస్తీ | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
జోన్ | చంద్రాయణగుట్ట |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500023 |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
నవాబ్ సాహెబ్ కుంట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీకి సమీపంలోని ప్రాంతం.[1] 1978 నుండి దుకాణాలు, పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయబడింది. ఇక్కడ ముస్లింలు అధికంగా ఉన్నారు.[2] హైదరాబాదులోని పురాతన ప్రాంతాలలో ఒకటైన ఈ నవాబ్ సాహెబ్ కుంట, మున్సిపల్ కార్పోరేషన్ గా మార్చబడింది.[3]
ఉపప్రాంతాలు
[మార్చు]- అక్బర్ కాలనీ
- శాస్త్రి పురం
- తీగల కుంట
- న్యూ అక్బర్ కాలనీ
- అచ్చి రెడ్డి నగర్
- బాబుల్ రెడ్డి నగర్
- బిలాల్ నగర్
- బుష్రత్ నగర్
- గౌస్ నగర్
- గుల్జార్ నగర్
- హబీబ్ నగర్
- కింగ్స్ కాలనీ
- మైలార్ దేవులపల్లి
- మోడల్ టౌన్ కాలనీ
- ముస్తఫా నగర్
- రహమత్ నగర్
- రషీద్ కాలనీ
- సలేహీన్ కాలనీ
- టెక్డి కాలనీ
- ఫూల్‌బాగ్
రాజకీయాలు
[మార్చు]ఈ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీ బలంగా ఉంది.[4]
ప్రార్థనా స్థలాలు
[మార్చు]ఇక్కడ హనుమాన్ దేవాలయం, శ్రీలక్ష్మి వెంకటేష్ దేవాలయం, ఎస్‌ఎల్‌వి దేవాలయం, సత్తార్ మసీదు, మసీదు-ఎ-రజియా, మసీదు జిబ్రాయిల్ అమీన్, మసీదు-ఎ-ఒమర్ ఫారూక్, మసీదు-ఎ-బిలాల్, మసీదు-ఎ-బీబీ ఫాతిమా మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా చార్మినార్, తీగలకుంట, మెహదీపట్నం, ముస్తఫా నగర్, శివరాంపల్లి, ఎన్ జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోఠి, మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[5] ఇక్కడికి సమీపంలోని శివరాంపల్లి, ఫలక్ నుమా ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Heavy rain lashes city". Times of India. 9 August 2008. Retrieved 2021-02-03.
- ↑ "Residents give a thumbs down to water board". The Hindu. 5 November 2009. Archived from the original on 2009-06-18. Retrieved 2021-02-03.
- ↑ Khan, Asif Yar. "A student and a corporator too!". The Hindu. Retrieved 2021-02-03.
- ↑ "MIM and the political contours of Old City". The Hans India. Retrieved 2021-02-03.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-03.
{{cite web}}
: CS1 maint: url-status (link)