Jump to content

టోలీచౌకీ

అక్షాంశ రేఖాంశాలు: 17°22′28″N 78°26′30″E / 17.37444°N 78.44167°E / 17.37444; 78.44167
వికీపీడియా నుండి
టోలీచౌకీ
టోలీచౌకీ is located in Telangana
టోలీచౌకీ
టోలీచౌకీ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
టోలీచౌకీ is located in India
టోలీచౌకీ
టోలీచౌకీ
టోలీచౌకీ (India)
Coordinates: 17°22′28″N 78°26′30″E / 17.37444°N 78.44167°E / 17.37444; 78.44167
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 008
Vehicle registrationటిఎస్ 13
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకార్వాన్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

టోలీచౌకీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1][2] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 68లో ఉంది.[3]

పదవివరణ

[మార్చు]

టోలీచౌకీ అనే పేరు 'టోలి' అనే ఉర్దూ పదం నుండి వచ్చింది. టోలీ అంటే 'బృందం', 'చౌకి', అంటే 'పోస్ట్' అని అర్థం.

చరిత్ర

[మార్చు]

అబుల్ హసన్ తానా షా కాలంలో, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలమ్‌గిర్ సైన్యం కుతుబ్ షాహి రాజ్యంలోని గోల్కొండ కోట సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో తమ సైనిక స్థానాన్ని ఏర్పాటు చేశాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక చారిత్రక మసీదులు, సమాధులు, ఇతర స్మారక చిహ్నాలు ఉన్నాయి.

ఇది గచ్చిబౌలి, మాదాపూర్‌, మణికొండ, కొండపూర్ వంటి ఐటి కారిడార్‌కు దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. అందువల్ల చుట్టుపక్కల ప్రాంతాలనుండి చాలామంది ఇక్కడికి వస్తుంటారు.[4][5] ఇక్కడ హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ఉంది.

ఉపప్రాంతాలు

[మార్చు]
  1. విరాసాట్ నగర్
  2. మీరాజ్ కాలనీ
  3. ఎండి లైన్స్
  4. ఆదిత్య నగర్ కాలనీ
  5. అల్ హస్నాథ్ కాలనీలు
  6. అరవింద్ నగర్ కాలనీ
  7. అరుణ కాలనీ
  8. అజీజ్ బాగ్ కాలనీ
  9. బాల్‌రెడ్డి నగర్
  10. బెంటౌబావ్డి
  11. డీలక్స్ కాలనీ
  12. హన్స్ నగర్ కాలనీ
  13. జానకి నగర్ కాలనీ
  14. ఎండి కాలనీ
  15. నీరజ్ కాలనీ
  16. ఒవైసి కాలనీ
  17. రాహుల్ నగర్
  18. సబ్జా కాలనీ
  19. సమతా కాలనీ
  20. వాలి కాలనీ
  21. యూసుఫ్ టేక్రీ
  22. ఎండి లైన్స్
  23. అక్బర్ పురా
  24. అరవింద్ నగర్ కాలనీ
  25. ఇయాస్ కాలనీ
  26. సాలార్ జంగ్ కాలనీ
  27. అల్ హస్నాథ్ కాలనీ
  28. బాల్ రెడ్డి నగర్
  29. మిరాజ్ కాలనీ

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో టోలీచౌకీ మీదుగా మెహదీపట్నం, లక్డికాపూల్, అబిడ్స్, కోఠి, షేక్‌పేట, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పటాన్‌చెరు, భెల్ వరకు బస్సులు నడుపబడుతున్నాయి.[6]

మూలాలు

[మార్చు]
  1. Bushra Baseerat (2011-06-04). "Techies build bright careers in drab Old City". The Times of India. Archived from the original on 2011-06-08. Retrieved 2021-01-31.
  2. "Toli Chowki Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-31.
  4. A.Y.K. (2010-08-29). "FEATURES / DOWNTOWN : Tolichowki new destination for shoppers". The Hindu. Retrieved 2021-01-31.
  5. K P Narayana Kumar (2001-11-01). "The road from Toli Chowki to Langar Houz". The Times of India. Archived from the original on 2012-09-05. Retrieved 2021-01-31.
  6. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.
"https://te.wikipedia.org/w/index.php?title=టోలీచౌకీ&oldid=4272966" నుండి వెలికితీశారు