Jump to content

ఆల్విన్ కాలనీ

అక్షాంశ రేఖాంశాలు: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417
వికీపీడియా నుండి
ఆల్విన్ కాలనీ
సమీపప్రాంతం
ఆల్విన్ కాలనీ is located in Telangana
ఆల్విన్ కాలనీ
ఆల్విన్ కాలనీ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
ఆల్విన్ కాలనీ is located in India
ఆల్విన్ కాలనీ
ఆల్విన్ కాలనీ
ఆల్విన్ కాలనీ (India)
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E / 17.483; 78.417
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 072
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఆల్విన్ కాలనీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1] ఇది హైదరాబాదు నగరానికి వాయవ్యంలో ఉన్న కూకట్‌పల్లికి సమీపంలో ఉంది. ఈ కాలనీ 1వ,[2] 2వ[3] ఫేజ్ లుగా విభజించారు. హైదరాబాదు ఆల్విన్ కంపెనీ తన ఉద్యోగుల కోసం 1980లలో ఈ కాలనీ నిర్మించింది.

2015 హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జిహెచ్ఎంసీ) సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి జోన్ పరిధిలోని కొత్త కార్పోరేషన్ వార్డుగా ఏర్పడింది.

చరిత్ర

[మార్చు]

ఆల్విన్ హౌసింగ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ అభివృద్ధి చేయబడింది. ఇందులో ఎ-టైప్, బి-టైప్, సి-టైప్ వంటి రకాలతో గృహాలను నిర్మించారు. ఎ-టైప్‌లో 120 గజాల భూమి ఉండగా, బి-టైప్ & సి-టైప్ క్వార్టర్స్‌లో 96 గజాలు ఉన్నాయి. లాటరీ పద్ధతి ఆధారంగా ఇవి కేటాయించబడ్డాయి. నిర్మాణం తరువాత, సొసైటీ దశ -1లో 600 ప్లాట్లను రూపొందించి, వీటిని 1987లో లాటరీ ద్వారా సభ్యులకు కేటాయించారు. 2011లో మంజీరా నీరు, విద్యుత్, రవాణా, దేవాలయాలు, వాణిజ్య సముదాయం, కళ్యాణ మండపం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా సొసైటీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆల్విన్ కాలనీలో 1000 కంటే ఎక్కువ సొంత గృహాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.

భరత్ నగర్ రైల్వే స్టేషను, బోరబండ రైల్వే స్టేషను ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.

సమీప ప్రాంతాలు

[మార్చు]

వివేకానంద నగర్ కాలనీ, వెంకట్పపయ్య నగర్, సాయినగర్, కమల ప్రసన్న నగర్, మాధవరం నగర్, తులసి నగర్, భాగ్యనగర్ కాలనీ, జగద్గిరిగుట్ట, ఎల్లమ్మ బండ, వెంకటేశ్వర నగర్, కూకట్ పల్లి మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Allwyn Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.
  2. "1st Phase Allwyn Colony, Allwyn Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.
  3. "2nd Phase, Allwyn Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.

ఇతర లంకెలు

[మార్చు]