బైరామల్‌గూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బైరామల్‌గూడ
నివాసప్రాంతం
బైరామల్‌గూడ is located in Telangana
బైరామల్‌గూడ
బైరామల్‌గూడ
హైదరాబాదులో ప్రాంతం ఉనికి
బైరామల్‌గూడ is located in India
బైరామల్‌గూడ
బైరామల్‌గూడ
బైరామల్‌గూడ (India)
నిర్దేశాంకాలు: 17°20′25″N 78°32′28″E / 17.340196°N 78.54124°E / 17.340196; 78.54124Coordinates: 17°20′25″N 78°32′28″E / 17.340196°N 78.54124°E / 17.340196; 78.54124
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 079
వాహనాల నమోదు కోడ్టిఎస్
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
జాలస్థలిtelangana.gov.in

బైరామల్‌గూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి సమీపంలోని ఒక నివాస ప్రాంతం. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలంకు చెందిన గ్రామం.[1]

వాణిజ్య ప్రాంతం[మార్చు]

ఇక్కడ అనేక వస్త్ర దుకాణాలు, నగల దుకాణాలు ఉన్నాయి. శ్రీ నిలయం గార్డెన్స్, గజ్జల జంగారెడ్డి గార్డెన్స్, పిండి పుల్లారెడ్డి గార్డెన్స్, ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్, కెకెకె గార్డెన్స్ వంటి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి.

దేవాలయాలు[మార్చు]

  1. బంగారు మైసమ్మ తల్లి దేవాలయం
  2. శ్రీ శక్తి హనుమాన్ దేవాలయం
  3. చంద్ర మౌళీశ్వరస్వామి దేవాలయం

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి బైరమల్‌గూడకు బస్సులు (104ఆర్, 277, 293, 93 మొదలైనవి) నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో మలక్ పేట హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్. రైలు స్టేషను, ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను ఉన్నాయి.

సికింద్రాబాదు నుండి ఓవైసీ రోడ్డు, శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు మార్గాలకు సులువుగా వెళ్ళేందుకు బైరామల్‌గూడ జంక్షన్ దగ్గర స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా 26.45 కోట్ల రూపాయలతో 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పులో నిర్మించిన బైరామల్‌గూడ ఫ్లైఓవర్ (కుడివైపు) నిర్మించబడింది. 2020, ఆగస్టు 11న తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.[2][3]

ఇతర వివరాలు[మార్చు]

  1. ఇక్కడికి సమీపంలో 400 సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయం ఉంది.
  2. ఇక్కడ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ (మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్), తిరుమల హాస్పిటల్ ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-downtown/article932647.ece
  2. The New Indian Express, Hyderabad (11 August 2020). "Bairamalguda flyover opened". Archived from the original on 18 October 2020. Retrieved 18 December 2020.
  3. నమస్తే తెలంగాణ, హైదరాబాదు (10 August 2020). "బైరామ‌ల్‌గూడ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్". Archived from the original on 18 December 2020. Retrieved 18 December 2020.