ఎగ్గే మల్లేషం
ఎగ్గే మల్లేషం | |||
| |||
ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 మార్చి 30 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | నాగోల్, ఉప్పల్ మండలం, హైదరాబాదు, తెలంగాణ | 1956 మే 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాములు, రాజమ్మ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీ స్వరూప | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె |
ఎగ్గే మల్లేషం తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[2][3] ఆయన 2024 జులై 5న టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4][5][6]
జీవిత విషయాలు
[మార్చు]మల్లేషం 1956, మే 5న రాములు, రాజమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోల్ జన్మించాడు. ఇంటర్మీడియట్ పూర్తిచేసి వ్యవసాయరంగంలో పనిచేశాడు.[7]ఆయన తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[8]
వ్యక్తిగత వివరాలు
[మార్చు]మల్లేషంకు లక్ష్మీ స్వరూపతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
రాజకీయరంగం
[మార్చు]1981లో నాగోల్ గ్రామ పంచాయితీ మెంబరుగా పనిచేశాడు. 2019, మార్చి 30న టిఆర్ఎస్ పార్టీ తరపున శాసనసభ్యులచే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[9][10]
ఇతర వివరాలు
[మార్చు]మలేషియా, సింగపూర్ మొదలైన దేశాలలో పర్యటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Charan (2019-06-05). "MLC Yegge Mallesham distributes Ramzan gifts". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-04.
- ↑ Telangana-Legislature, MLCs (4 August 2021). "Members Information - Telangana-Legislature". telanganalegislature.org.in. Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ IANS (2019-03-12). "Telangana Home Minister among 5 elected to Council". Business Standard India. Retrieved 2021-08-04.
- ↑ NT News (5 July 2024). "కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు." Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ The Hindu (5 July 2024). "Six BRS MLCs shock the BRS and join Congress" (in Indian English). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ Deccan Chronicle (5 July 2024). "BRS MLCs Join Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ admin (2020-10-01). "Telangana Assembly Constituency MLC Yegge Mallesham". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-04. Retrieved 2021-08-04.
- ↑ Sakshi (13 January 2018). "గొర్రెల పంపిణీ ఘనత కేసీఆర్‌దే". Retrieved 11 August 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Telangana MLC polls: Home Minister among 4 TRS candidates elected to state Council". The News Minute (in ఇంగ్లీష్). 2019-03-13. Retrieved 2021-08-04.
- ↑ "TRS, MIM candidates win MLC polls as expected". The Hindu (in Indian English). Special Correspondent. 2019-03-12. ISSN 0971-751X. Retrieved 2021-08-04.
{{cite news}}
: CS1 maint: others (link)