బొంతు రామ్మోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొంతు రామ్మోహన్
బొంతు రామ్మోహన్


గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ యొక్క మేయర్
పదవీ కాలము
ఫిబ్రవరి 11, 2016 – 11 ఫిబ్రవరి 2021
ముందు మహ్మద్ మజీద్ హుస్సేన్

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 5, 1973
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

బొంతు రామ్మోహన్ (జననం 1973 జూలై 5) తెలంగాణ రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయ నాయకుడు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రామ్మోహన్ హైదరాబాద్ నగరానికి మొదటి మేయర్.[1] [2]

జననం - కుటుంబం[మార్చు]

వరంగల్ జిల్లా, మహబూబాబాద్‌ వాసులైన బొంతు వెంకటయ్య, కమలమ్మ దంపతులకు 1973, జూలై 5న రామ్మోహన్‌ జన్మించాడు. రామ్మోహన్‌కు ఇద్దరు అక్కచెల్లెళ్లున్నారు. 2004 లో హైదరాబాద్‌ కు చెందిన శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు కుమార్తెలు (కుజిత, ఉషశ్రీ) ఉన్నారు.[2]

చదువు[మార్చు]

ప్రాథమిక విద్యను ఆమనగల్ లో, ఉన్నత విద్యను మహబూబాబాద్‌ లో చదివాడు. ఇంటర్ విద్యను మహబూబాబాద్‌ లోని ఎస్.ఎస్.సి. జూనియర్ కళాశాలలో, డిగ్రీ వరంగల్‌ లో చదివాడు. అనంతరం హైదరాబాద్ కి వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎంఏ, ఎల్‌.ఎల్‌.బీ. చేశారు. [2]

విద్యార్థి నాయకుడిగా[మార్చు]

ఉస్మానియా విశ్వవిద్యాలయం లో విద్యార్థిగా ఉన్న సమయంలో అక్కడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేశారు. [2]

రాజకీయ జీవితం[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2002లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఆ తరువాత 2005-07లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, 2007-09లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం బాధ్యుడిగా, టీఆర్‌ఎస్‌ కార్యదర్శిగా పదవులు నిర్వర్తించాడు.

గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో చర్లపల్లి డివిజన్ నుంచి కార్పోరేటర్ గా గెలిచి, మేయర్ సీటును దక్కించుకున్నారు.

మూలాలు[మార్చు]

  1. సాక్షి, హైదరాబాద్, కథ. "'గ్రేటర్' మేయర్‌గా బొంతు రామ్మోహన్". Retrieved 7 January 2017. CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 2.2 2.3 ఆంథ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు. "గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌". Retrieved 7 January 2017. CS1 maint: discouraged parameter (link)