మహబూబాబాదు జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహబూబాబాద్ జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.

మహబూబాబాదు జిల్లా

2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

అక్టోబరు 11, 2016 న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ఒకటి కాగా నూతనంగా ఏర్పాటైన తొర్రూరు రెండవది.మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని 16 మండలాలలో 14 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాలోనివి కాగా రెండు మండలాలు ఖమ్మం జిల్లాలోనివి.[2]

మండలాలు[మార్చు]

 1. మహబూబాబాద్.
 2. కురవి.
 3. కేసముద్రం.
 4. డోర్నకల్.
 5. గూడూరు.
 6. కొత్తగూడ.
 7. చిన్నగూడూర్.
 8. తొర్రూరు.
 9. నెల్లికుదుర్.
 10. మరిపెడ.
 11. నర్సింహులుపేట.
 12. పెద్దవంగర.
 13. బయ్యారం.
 14. గార్ల.
 15. దంతాలపల్లి.
 16. గంగారం.

గమనిక: పై వాటిలో వ.సంఖ్య ఒకటి నుండి పన్నెండు వరకు గల మండలాలు వరంగల్ జిల్లాకు చెందిన పాత మండలాలు కాగా, బయ్యారం, గార్ల రెండు ఖమ్మం జిల్లాకు చెందినవి. చివరి రెండు గ్రామాలు మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఏర్పడిన దంతాలపల్లి, నర్స్ంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో ఏర్పడిన గంగారం రెండు నూతన మండలాలు.

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/

వెలుపలి లింకులు[మార్చు]