పెద్దవంగర మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దవంగర
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, పెద్దవంగర స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, పెద్దవంగర స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, పెద్దవంగర స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం పెద్దవంగర
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 191 km² (73.7 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 68,400
 - పురుషులు 34,438
 - స్త్రీలు 33,962
పిన్‌కోడ్ 506317


పెద్దవంగర మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 10 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం తొర్రూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జనగామ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం పెద్దవంగర.

గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 191 చ.కి.మీ. కాగా, జనాభా 68,400. జనాభాలో పురుషులు 34,438 కాగా, స్త్రీల సంఖ్య 33,962. మండలంలో 16,515 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన మండలం[మార్చు]

లోగడ పెదవంగర గ్రామం వరంగల్ జిల్లా, జనగాం రెవెన్యూ డివిజను పరిధిలోని కొడకండ్ల మండలానికి చెందిన గ్రామం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దవంగర గ్రామాన్ని (1+9) పది గ్రామాలుతో కొత్త మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. గంట్లకుంట
  2. పోచన్‌పల్లి
  3. ఔతాపూర్
  4. పెద్దవంగర
  5. కొరిపల్లి
  6. వడ్డేకొత్తపల్లి
  7. పోచారం
  8. చిన్నవంగర
  9. చిట్యాల్
  10. బొమ్మకల్

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]