నర్సింహులపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నర్సింహులపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

నర్సింహులపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, నర్సింహులపేట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, నర్సింహులపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 17°30′36″N 79°48′16″E / 17.51°N 79.804444°E / 17.51; 79.804444
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం నర్సింహులపేట
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 100 km² (38.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 58,704
 - పురుషులు 29,690
 - స్త్రీలు 29,014
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.00%
 - పురుషులు 57.92%
 - స్త్రీలు 33.75%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం తొర్రూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  9  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం నర్సింహులపేట

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,704 - పురుషులు 29,690 - స్త్రీలు 29,014.[3] పిన్ కోడ్: 506318.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 100 చ.కి.మీ. కాగా, జనాభా 28,819. జనాభాలో పురుషులు 14,628 కాగా, స్త్రీల సంఖ్య 14,191. మండలంలో 7,320 గృహాలున్నాయి.[4]

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ నర్సింహులపేట గ్రామం/మండలం వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నర్శింహులుపేట మండలాన్ని(1+8) తొమ్మిది గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా,కొత్తగా ఏర్పడిన తొర్రూర్ రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. [5]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. వంతదూపుల
  2. నర్సింహులపేట
  3. కొమ్ములవంచ
  4. జయపురం
  5. బొజ్జన్నపేట్
  6. కౌసల్యాదేవిపల్లి
  7. ముంగిమడుగు
  8. పెద్దనాగారం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకొనబడలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-14. Retrieved 2017-11-10.

బయటి లింకులు[మార్చు]