హనుమకొండ
హనుమకొండ లేదా హన్మకొండ, తెలంగాణ రాష్ట్రములోని వరంగల్ (పట్టణ) జిల్లాకు చెందిన ఒక నగరం, మండల కేంధ్రం.[1]
హనుమకొండ | |
— మండలం — | |
వరంగల్ జిల్లా పటములో హనుమకొండ మండలం యొక్క స్థానము | |
తెలంగాణ పటములో హనుమకొండ యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రము | హనుమకొండ |
గ్రామాలు | 16 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,27,303 |
- పురుషులు | 2,14,814 |
- స్త్రీలు | 2,12,489 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 69.28% |
- పురుషులు | 80.76% |
- స్త్రీలు | 57.15% |
పిన్ కోడ్ | {{{pincode}}} |
విషయ సూచిక
గణాంకాలు[మార్చు]
- జనాభా 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 4,27,303 - పురుషులు 2,14,814 - స్త్రీలు 2,12,489 [1]
గ్రామ చరిత్ర[మార్చు]
చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి అనుముకొండ అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతము జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్కాలిక రాజధానిగా కొంతకాలం ఇక్కడి నుండే పరిపాలన సాగించారు. ఇక్కడ ఎంతో విశిష్టత కలిగిన సిద్ధి భైరవ దేవాలయం ఉంది.[2]
బతుకమ్మ, దసరా పండుగలు[మార్చు]
హన్మకొండ పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా విషయంలో మాత్రం పల్లెలకంటే గొప్పగా పండుగలను జరుపుకుంటారు. పితృఅమావాస్య (పెత్రమావస్య) తో బతుకమ్మ పండుగ మొదలయ్యి తొమ్మిది రోజుల పాటు రోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటారు. అయితే ఆరవ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. పెత్రమావస్య ముందు రోజు సాయంత్రం నుండి చుట్టుప్రక్కల పల్లెలనుండి తంగేడు, గునుగు, తామర, బంతి, చేమంతి మొదలగు పువ్వులను అమ్ముతారు. వీటితో పాటు బతుకమ్మ పేర్చడానికి సిబ్బులు, గుమ్మడి ఆకులను కూడా అమ్ముతారు. తిరిగి వీటినన్నింటిని బతుకమ్మ ముందురోజు కూడా అమ్మతారు. బతుకమ్మ మొదటిరోజు నుండి ఎనిమిదోరోజు వరకు అందరు వారి ఇంటిదగ్గరి గుళ్ళల్లో బతుకమ్మ ఆడుతారు. కాని తోమ్మిదో రోజయిన దుర్గాష్టమి నాడు సాయంత్రం మాత్రం, పిల్లల నుండి పెద్దలవరకు, ఎన్నడూ ఇంట్లనుండి బయటికి వెళ్ళని వారు కూడా ప్రతిఒక్కరు కొత్తబట్టలు వేసుకొని, వివిధ నగలను ధరించి బతకమ్మలను చేత బట్టుకుని పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!!, రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో !! రామ రామా నంది ఉయ్యాలో ! రాగ మెత్తరాదు ఉయ్యాలో!అని గొంతెత్తి ఒకరు పాడగా మిగతా వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.
బతుకమ్మను సుమారు గంట నుండి రెండు గంటల వరకు ఆడినతర్వాత, బతుకమ్మను నీళ్ళల్లో వదులుతారు. బతుకమ్మతోబాటు సద్దులుకూడా పట్టుకపోతారు. సత్తిపిండి, నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్ళల్లో వదిలిన తర్వాత సద్దులను అందరు పంచుకుని తిని, పసుపు కుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు.
బతుకమ్మకు ఒక్కరోజు విరామం తర్వాత వచ్చే దసరా పండుగ, హన్మకొండలో జరుపుకోనే పండుగలలో ప్రధానమైనది, ముఖ్యమైనదికూడా. దసరా రోజు ప్రతి ఒక్కరు తమ తమ వాహనాలను కడుక్కొని, పూలదండవేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. చేతిపనులవారు తమ పనిముట్లకు, పరిశ్రమలవారు మిషిన్లకు పూజలు చేస్తారు. పోలీస్, మిలిటరీ వాళ్ళుకూడా తమ ఆయుధాలకు పూజచేస్తారు. ఇండ్లకు ముగ్గుపోయడం, గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభం మొదలగు కొత్తపనులను చేస్తారు. బతుకమ్మరోజు కూరగాయల భోజనంచేస్తే, దసరా నాడు మాత్రం మాంసాహార భోజనం చేస్తారు. పూరీలు, గారెలు చేసుకుంటారు. చాలా మంది మద్యాన్నికూడా సేవిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుండి పురుషులు, స్త్రీలు, పిల్లలూ అందరూ కొత్తబట్టలు వేసుకొని జమ్మి కొరకు పద్మాక్షమ్మగుట్టకు పోతారు. గుట్ట దగ్గరికి పోవడానికి బలమైన కారణముంది. గుట్ట దగ్గరికి వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రతివొక్కరు వస్తారు. తమ చిన్ననాటి మిత్రులను, దోస్తులను కలుస్తారు. జమ్మియాకు తీసుకొని, పాలపిట్టను చూసి, దసరా ఉత్సవ కమిటీవారు ఏర్పాటు చేసిన రావణాసుర వధను చూసి ఇంటికి వస్తారు. గుట్టదగ్గరి నుండి ఇంటికి వచ్చేవరకు, వచ్చినతర్వాత పెద్దలకు, మిత్రులకు జమ్మిఆకూ చేతిలపెట్టి కాళ్ళకుమొక్కి, ఆలింగనం చేసుకుంటారు. కొంత జమ్మియాకును బీరువాలల్లో వేసుకుంటారు.
శాసనసభ నియోజకవర్గం[మార్చు]
- పూర్తి వ్యాసం హనుమకొండ శాసనసభ నియోజకవర్గంలో చూడండి.
మండలంలోని పట్టణాలు[మార్చు]
- హనుమకొండ
సకలజనుల సమ్మె[మార్చు]
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://warangalurban.telangana.gov.in/wp-content/uploads/2016/10/231.Warangal-U-231.pdf
- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ, ఆదివారం సంచిక (9 September 2018). "సిద్ధులగుట్ట సిద్ధ భైరవ ఆలయం". అరవింద్ ఆర్య పకిడే. Archived from the original on 13 September 2018. Retrieved 13 September 2018.