కుల్చారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుల్చారం
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో కుల్చారం మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో కుల్చారం మండలం యొక్క స్థానము
కుల్చారం is located in Telangana
కుల్చారం
కుల్చారం
తెలంగాణ పటములో కుల్చారం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°57′19″N 78°11′56″E / 17.9553°N 78.1989°E / 17.9553; 78.1989
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రము కుల్చారం
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 35,910
 - పురుషులు 17,509
 - స్త్రీలు 18,401
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.97%
 - పురుషులు 59.79%
 - స్త్రీలు 30.54%
పిన్ కోడ్ {{{pincode}}}
కుల్చారం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం కుల్చారం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కుల్చారం, తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. కుల్చారం: కొల్చారం ‘కోలాచలం మల్లినాథసూరి’ జన్మస్థలం. మల్లినాథుడు సంస్కృత పంచకావ్యాలకు (రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం-కాళిదాసురచనలు, కిరాతార్జునీయం-భారవిరచన, శిశుపాలవధ-మాఘునిరచన) సంజీవనీ, ఘంటాపథ,సర్వంకష వ్యాఖ్యలు రాసిన మహాపండితుడు.భారతదేశంలోనే మల్లినాథుని వంటి ప్రజ్ఞావంతుడు మరొకరు లేరని చెప్పవచ్చు. మొత్తం 15 సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యలు రాసినవాడు,19 శాస్త్ర్రాల పరిణత కలవాడు,5 స్వీయరచనలు చేసినవాడు, పండితవంశంలో పుట్టినవాడు, తెలంగాణాలో ఇంతటి సంస్కృతభాషాకోవిదుడు మరొకరు మనకు కనిపించడు. వారిల్లే తరతరాలుగా గొప్ప సంస్కృత విద్యాకేంద్రం. మల్లినాథుడు చిన్నపుడు విద్యాగంధం అబ్బక వూరికి దక్షిణాన వున్న తిరుమలకుచ్చకు పసులను తోలుకుని పోయి కాసేవాడట.ఆ గుట్టగుహలో తపస్సు చేసుకుంటున్న ఒక సిద్ధయోగికి ఆవుపాలు పోసి, ఆహారమిచ్చి సేవలు చేసాడట.దానికి మెచ్చి ఆ యోగి మల్లినాథునికి సారస్వత మంత్రోపదేశం చేసినందువల్లనే మల్లినాథుడు విద్యావంతుడై కాశీలో చదివి యోగ్యుడై తిరిగి గ్రామం చేరి,అప్పటిదాకా ఎవరికి అర్థం కాని కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యలు రాసినాడట.పితామహుడు మల్లినాథుడు శతావధాని.కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తిచే కనకాభిషేక గౌరవం పొందినాడట. తండ్రి కపర్థిస్వామి ‘ఆపస్తంబ శ్రౌతకల్ప గృహ్యసూత్రాల’కు భాష్యం రాసినవాడు.తాను సంస్కృతం నేర్పే విద్యార్థుల కోసం సంస్కృత పంచకావ్యాలకు వ్యాఖ్యలు రాసినవాడు మల్లినాథ‘సూరి’. ఇతనికి 3 కుమారులు.మొదటివాడు పెద్దయార్యుడు (పెద్దిభట్టు),రెండవ కుమారుడు కుమారస్వామి (సోమపీథి) ప్రతాపరుద్రీయానికి రత్నాపణ వ్యాఖ్య రాసి సర్వజ్ఞసింగభూపాలుని చేత సత్కార మందిన వాడు.మూడవ కుమారుడు గిరినాథుడు నృసింహ విరచిత స్వరమనోజ్ఞమంజరికి వ్యాఖ్య రచించిన వాడు ఈ సంస్కృతపండితుల చేత వాసికెక్కిన గ్రామం కొల్చారం.ఈ వూరిచావడి పక్కన లభించిన శాసనం వల్ల జయంతిపురం రాజధానిగా ఏలుతున్న త్రిభువనమల్లదేవుని కాలంలో (క్రీ.శ.1116 జూలై 24న)అతని దండనాథుడైన గుండనాయకుడు బ్రాహ్మణులైన మాధవ భట్టోపాధ్యాయునికి, కుమారస్వామిభట్టునికి మెదకులో కొంతభూమిని దానమిచ్చినట్లు తెలుస్తున్నది. (Inscriptions of A.P. Medak District-No.74, pg.no.159) ఇది నిస్సందేహంగా మల్లినాథసూరి వంశీయులకిచ్చినదే కావచ్చునని మా అభిప్రాయం. గ్రామంలో మల్లినాథుని వంశీయులు ఉన్నారు. కోలాచల కాశీనాథశర్మ గారింటిని చూసాం. ఆ ఇంటికెదురుగా మల్లినాథసూరి నివసించిన ఇంటిజాగ ఉంది. కొల్చారంలో జైనపార్శ్వనాథుని విగ్రహం లభించిన ప్రదేశం పక్కన సుందరమైన వీరభద్రుని ఆలయం ఉంది. శిల్పం మనోజ్ఞంగా ఉంది.ఆలయద్వారానికి లలాటబింబంగా గజలక్ష్మి ఉంది. ఇది చాళుక్యుల సంప్రదాయమే. ప్రధానాలయానికి ఇరువైపుల ఉపాలయాలున్నాయి.అందులో విగ్రహాలు మారినట్లున్నాయి.ఎన్నో వీరగల్లులు వీరభద్రుని గుడి చుట్టుముట్టే బయట పారేసివున్నాయి. దేవాలయ ద్వారబంధం, మూలవిరాట్టుపై నుండే మకరతోరణం, నాగ, నాగినీ శిల్పాలు, 4 అడుగుల ఎత్తున్న వినాయకుడు దేవాలయ ప్రాంగణం అవతల పడి ఉన్నాయి.జైన విగ్రహం దొరికిన చోట మట్టిలో విరిగిపడి వున్న ఆలయద్వారం లలాటబింబంగా గజలక్ష్మే వుండడం విశేషం. గజలక్ష్మిని జైనదేవతగానే చెపుతుంటారు జైనులు. దొరికిన (విఘ్ననాశక)పార్శ్వనాథుని విగ్రహం వూరిబయట రోడ్డుపక్కన కొత్తగా నిర్మించిన జైనాలయంలో ప్రతిష్ఠించారు.ఈ ప్రదేశాన్ని ‘యాపపురం’ అంటారు.ఈ గుడి దిగంబరజైనశాఖకు చెందిన యాపనీయులది.ఈ విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుంటుంది. నల్ల (సాన)రాతి శిల్పం. కాయోత్సర్గ భంగిమలో ఉంది.విగ్రహపాదపీఠంపై ‘శ్రీ చాళుక్యకులతిలకం తైలపరసర్’ అని ఉంది. కళ్యాణీ చాళుక్యుల మూలపురుషుడైన రెండవ తైలపుడు (క్రీ.శ.973) నిలిపిన జైనదేవాయలయంలోనిదే పార్శ్వనాథుని విగ్రహం. (Inscriptions of A.P. Medak District-No.10, pg.no.17) ఆ ఆలయప్రాంగణంతలోనే గ్రామస్థులు చెక్కించి సిద్ధపరిచిన ‘మల్లినాథసూరి’ విగ్రహం ప్రతిష్ఠకై నిరీక్షిస్తున్నది. కొల్చారం గ్రామం చుట్టు ఒకప్పుడుండిన మట్టికోటగోడల దిబ్బలిప్పటికి అగుపిస్తున్నాయి.నాలుగు దిక్కుల్లో నాలుగు గైన్లు (గవనులు,కోటద్వారాలు),కోటచుట్టు కందకం వున్న ఆనవాళ్ళున్నాయి.కోట బయటపెరిగిన ఇప్పటి గ్రామాన్ని ప్రజలు అవతలికోట అని పిలుస్తున్నారు.అవతలికోట ద్వారానికి ఇరువైపుల రెండు అమ్మదేవతల గుళ్ళున్నాయి.ఉత్తరదిశలో వున్న గుడిలోని అమ్మదేవత గుహ్య యోగాసనముద్రలో ఉంది.కిరీటధారి, చతుర్భుజియైన దేవత నాలుగుచేతుల్లో ముందరి కుడిచేతిలో ఖడ్గం,వెనకచేతిలో.......ముందరి ఎడమచేతిలో గిన్నె, వెనక చేతిలో త్రిశూలంవున్నాయి. నడుముకు వడ్డాణం, మోకాళ్ళ వరకు అంగవస్త్రం, వక్షం అనాచ్ఛాదితంగా ఉంది.రాక్షసుని శిరస్సుపై మడిచిన ఎడమకాలివేళ్ళను మోపి నిలిచి, ఎడమకాలి మడిమపై కుడికాలివేళ్ళను మడిచి నిలిపి కుడికాలి మడిమను గుహ్యస్థానాన్ని తాకించి వుంచిన ఆసనస్థితిలో ఉంది.కాలికింద శిరస్సుకలిగిన ఈ దేవత కామాక్షి (కామాఖ్య) అవుతుందని కపిలవాయి లింగమూర్తిగారు చెప్పారు.అరుదైన శిల్పం.మరొక పక్క దక్షిణాన మరో అమ్మదేవతగుడి.అందులో పై అమ్మవారిలాంటి రూపమే. ఆసనస్థితిలో మార్పు.రెండుపాదాల వేళ్ళను మడిచి కూర్చున్న భంగిమ. కొల్చారానికి దక్షిణదిశలో తిరుమలాయకుచ్చ మీద వెంకటేశ్వరుని గుహాలయం ఉంది.గుడిలోని విగ్రహాలను దొంగలు దోచుకుపోతే కొత్త విగ్రహాలను ఆ స్థానంలో ప్రతిష్ఠించినారట.ఈ గుహాలయం సిద్దిపేట బయట చిన్నగుట్టపై వున్న రంగనాయకుని గుహాలయం వలెనె ఉంది. గుడి దిగువన కొలిచెలిమె అని పిలిచే కొలను అవశేషం ఉంది.మల్లినాథునికి మంత్రోపదేశం చేసిన ముని తపస్సుచేసిన చోటును గ్రామస్థులు చూపించారు. మల్లినాథుడు తపస్సు చేసిన చోట మరోచోట వుందట.

కొల్చారం ‘కోలాచలం మల్లినాథసూరి’ జన్మస్థలం. మల్లినాథుడు సంస్కృత పంచకావ్యాలకు (రఘువంశం, కుమారసంభవం,మేఘసందేశం-కాళిదాసురచనలు, కిరాతార్జునీయం-భారవిరచన,శిశుపాలవధ-మాఘునిరచన) సంజీవనీ, ఘంటాపథ, సర్వంకష వ్యాఖ్యలు రాసిన మహాపండితుడు.భారతదేశంలోనే మల్లినాథుని వంటి ప్రజ్ఞావంతుడు మరొకరు లేరని చెప్పవచ్చు.మొత్తం 15 సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యలు రాసినవాడు, 19 శాస్త్ర్రాల పారీణత కలవాడు,5 స్వీయరచనలు చేసినవాడు,పండితవంశంలో పుట్టినవాడు,తెలంగాణాలో ఇంతటి సంస్కృతభాషాకోవిదుడు మరొకరు మనకు కనిపించడు. వారిల్లే తరతరాలుగా గొప్ప సంస్కృత విద్యాకేంద్రం.మల్లినాథుడు చిన్నపుడు విద్యాగంధం అబ్బక వూరికి దక్షిణాన వున్న తిరుమలకుచ్చకు పసులను తోలుకుని పోయి కాసేవాడట.ఆ గుట్టగుహలో తపస్సు చేసుకుంటున్న ఒక సిద్ధయోగికి ఆవుపాలు పోసి, ఆహారమిచ్చి సేవలు చేసాడట.దానికి మెచ్చి ఆ యోగి మల్లినాథునికి సారస్వత మంత్రోపదేశం చేసినందువల్లనే మల్లినాథుడు విద్యావంతుడై కాశీలో చదివి యోగ్యుడై తిరిగి గ్రామం చేరి, అప్పటిదాకా ఎవరికి అర్థం కాని కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యలు రాసినాడట. పితామహుడు మల్లినాథుడు శతావధాని. కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తిచే కనకాభిషేక గౌరవం పొందినాడట.తండ్రి కపర్థిస్వామి ‘ఆపస్తంబ శ్రౌతకల్ప గృహ్యసూత్రాల’కు భాష్యం రాసినవాడు.తాను సంస్కృతం నేర్పే విద్యార్థుల కోసం సంస్కృత పంచకావ్యాలకు వ్యాఖ్యలు రాసినవాడు మల్లినాథ‘సూరి’.ఇతనికి 3 కుమారులు. మొదటివాడు పెద్దయార్యుడు (పెద్దిభట్టు), రెండవ కుమారుడు కుమారస్వామి (సోమపీథి) ప్రతాపరుద్రీయానికి రత్నాపణ వ్యాఖ్య రాసి సర్వజ్ఞసింగభూపాలుని చేత సత్కార మందిన వాడు.మూడవ కుమారుడు గిరినాథుడు నృసింహ విరచిత స్వరమనోజ్ఞమంజరికి వ్యాఖ్య రచించిన వాడు ఈ సంస్కృతపండితుల చేత వాసికెక్కిన గ్రామం కొల్చారం.ఈ వూరిచావడి పక్కన లభించిన శాసనం వల్ల జయంతిపురం రాజధానిగా ఏలుతున్న త్రిభువనమల్లదేవుని కాలంలో (క్రీ.శ.1116 జూలై 24న)అతని దండనాథుడైన గుండనాయకుడు బ్రాహ్మణులైన మాధవ భట్టోపాధ్యాయునికి, కుమారస్వామిభట్టునికి మెదకులో కొంతభూమిని దానమిచ్చినట్లు తెలుస్తున్నది. (Inscriptions of A.P. Medak District-No.74, pg.no.159) ఇది నిస్సందేహంగా మల్లినాథసూరి వంశీయులకిచ్చినదే కావచ్చునని మా అభిప్రాయం. గ్రామంలో మల్లినాథుని వంశీయులు ఉన్నారు.కోలాచల కాశీనాథశర్మ గారింటిని చూసాం.ఆ ఇంటికెదురుగా మల్లినాథసూరి నివసించిన ఇంటిజాగ ఉంది.

	కొల్చారంలో జైనపార్శ్వనాథుని విగ్రహం లభించిన ప్రదేశం పక్కన సుందరమైన వీరభద్రుని ఆలయం ఉంది.శిల్పం మనోజ్ఞంగా ఉంది.ఆలయద్వారానికి లలాటబింబంగా గజలక్ష్మి ఉంది.ఇది చాళుక్యుల సంప్రదాయమే. ప్రధానాలయానికి ఇరువైపుల ఉపాలయాలున్నాయి.అందులో విగ్రహాలు మారినట్లున్నాయి.ఎన్నో వీరగల్లులు వీరభద్రుని గుడి చుట్టుముట్టే బయట పారేసివున్నాయి.దేవాలయ ద్వారబంధం,మూలవిరాట్టుపై నుండే మకరతోరణం,నాగ,నాగినీ శిల్పాలు,4 అడుగుల ఎత్తున్న వినాయకుడు దేవాలయ ప్రాంగణం అవతల పడి ఉన్నాయి.జైన విగ్రహం దొరికిన చోట మట్టిలో విరిగిపడి వున్న ఆలయద్వారం లలాటబింబంగా గజలక్ష్మే వుండడం విశేషం.గజలక్ష్మిని జైనదేవతగానే చెపుతుంటారు జైనులు.

దొరికిన (విఘ్ననాశక)పార్శ్వనాథుని విగ్రహం వూరిబయట రోడ్డుపక్కన కొత్తగా నిర్మించిన జైనాలయంలో ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశాన్ని ‘యాపపురం’ అంటారు. ఈ గుడి దిగంబరజైనశాఖకు చెందిన యాపనీయులది.ఈ విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుంటుంది. నల్ల (సాన)రాతి శిల్పం. కాయోత్సర్గ భంగిమలో ఉంది. విగ్రహపాదపీఠంపై ‘శ్రీ చాళుక్యకులతిలకం తైలపరసర్’ అని ఉంది.కళ్యాణీ చాళుక్యుల మూలపురుషుడైన రెండవ తైలపుడు (క్రీ.శ.973) నిలిపిన జైనదేవాయలయంలోనిదే పార్శ్వనాథుని విగ్రహం. (Inscriptions of A.P. Medak District-No.10, pg.no.17) ఆ ఆలయప్రాంగణంతలోనే గ్రామస్థులు చెక్కించి సిద్ధపరిచిన ‘మల్లినాథసూరి’ విగ్రహం ప్రతిష్ఠకై నిరీక్షిస్తున్నది. కొల్చారం గ్రామం చుట్టు ఒకప్పుడుండిన మట్టికోటగోడల దిబ్బలిప్పటికి అగుపిస్తున్నాయి.నాలుగు దిక్కుల్లో నాలుగు గైన్లు (గవనులు,కోటద్వారాలు),కోటచుట్టు కందకం వున్న ఆనవాళ్ళున్నాయి.కోట బయటపెరిగిన ఇప్పటి గ్రామాన్ని ప్రజలు అవతలికోట అని పిలుస్తున్నారు. అవతలికోట ద్వారానికి ఇరువైపుల రెండు అమ్మదేవతల గుళ్ళున్నాయి. ఉత్తరదిశలో వున్న గుడిలోని అమ్మదేవత గుహ్య యోగాసనముద్రలో ఉంది.కిరీటధారి,చతుర్భుజియైన దేవత నాలుగుచేతుల్లో ముందరి కుడిచేతిలో ఖడ్గం,వెనకచేతిలో....... ముందరి ఎడమచేతిలో గిన్నె,వెనక చేతిలో త్రిశూలంవున్నాయి.నడుముకు వడ్డాణం,మోకాళ్ళ వరకు అంగవస్త్రం,వక్షం అనాచ్ఛాదితంగా ఉంది.రాక్షసుని శిరస్సుపై మడిచిన ఎడమకాలివేళ్ళను మోపి నిలిచి, ఎడమకాలి మడిమపై కుడికాలివేళ్ళను మడిచి నిలిపి కుడికాలి మడిమను గుహ్యస్థానాన్ని తాకించి వుంచిన ఆసనస్థితిలో ఉంది. కాలికింద శిరస్సుకలిగిన ఈ దేవత కామాక్షి (కామాఖ్య) అవుతుందని కపిలవాయి లింగమూర్తిగారు చెప్పారు.అరుదైన శిల్పం. మరొక పక్క దక్షిణాన మరో అమ్మదేవతగుడి.అందులో పై అమ్మవారిలాంటి రూపమే.ఆసనస్థితిలో మార్పు.రెండుపాదాల వేళ్ళను మడిచి కూర్చున్న భంగిమ. కొల్చారానికి దక్షిణదిశలో తిరుమలాయకుచ్చ మీద వెంకటేశ్వరుని గుహాలయం ఉంది. గుడిలోని విగ్రహాలను దొంగలు దోచుకుపోతే కొత్త విగ్రహాలను ఆ స్థానంలో ప్రతిష్ఠించినారట.ఈ గుహాలయం సిద్దిపేట బయట చిన్నగుట్టపై వున్న రంగనాయకుని గుహాలయం వలెనె ఉంది.గుడి దిగువన కొలిచెలిమె అని పిలిచే కొలను అవశేషం ఉంది. మల్లినాథునికి మంత్రోపదేశం చేసిన ముని తపస్సుచేసిన చోటును గ్రామస్థులు చూపించారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 35,910 - పురుషులు 17,509 - స్త్రీలు 18,401

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]


Medak.jpg

మెదక్ జిల్లా మండలాలు

మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్‌ | రైకోడ్‌ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్‌ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్‌ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్‌ | ములుగు

"https://te.wikipedia.org/w/index.php?title=కుల్చారం&oldid=2328274" నుండి వెలికితీశారు