వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]
- స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం
- పరకాల అసెంబ్లీ నియోజకవర్గం
- పశ్చిమ వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గం
- తూర్పు వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గం
- వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం
- భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ రెండవ 1957–62 సాదత్ ఆలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962–67 బకర్ అలీ మిర్జా భారత జాతీయ కాంగ్రెస్ నాలుగవ 1967–71 రామసహాయం సురేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971–77 ఎస్.బి. గిరి తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977–80 జి.మల్లికార్జునరావు భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980–84 కమాలుద్దీన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984–89 డా. టి. కల్పనాదేవి తెలుగుదేశం తొమ్మిదవ 1989–91 రామసహాయం సురేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991–96 రామసహాయం సురేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996–98 అజ్మీరా చందులాల్ తెలుగుదేశం పండ్రెండవ 1998–99 అజ్మీరా చందులాల్ తెలుగుదేశం పదమూడవ 1999–04 బోడకుంటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పద్నాలుగవ 2004–2008 డి. రవీంద్ర నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి పద్నాలుగవ 2008–2009 ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పదుహేనవ 2009–14 సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ
2004 ఎన్నికలు[మార్చు]
2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం
భారత సాధారణ ఎన్నికలు,2004: వరంగల్ | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలంగాణా రాష్ట్ర సమితి | ధరావత్ రవీందర్ నాయక్ | 427,601 | 46.38 | +46.38 | |
తెలుగుదేశం పార్టీ | బోదకుంటి వెంకటేశ్వర్లు | 408,339 | 44.29 | -2.06 | |
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | రావులపల్లి కొండలరావు | 19,080 | 2.07 | ||
Independent | స్వామి నల్లాని రావు | 16,424 | 1.78 | ||
బహుజన సమాజ్ పార్టీ | ఎలియా మామిడాల | 14,376 | 1.56 | ||
Independent | ఝాన్సీ గాడి | 9,619 | 1.04 | ||
మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్.ఎస్.శ్రీవాస్తవ) | వాల్లేపు ఉపేంద్ర రెడ్డి | 7,080 | 0.77 | +0.04 | |
Independent | ముంజల భిక్షపతి | 6,930 | 0.75 | ||
Independent | కల్లేపల్లి ఇందిర | 6,829 | 0.74 | ||
Independent | తేజవత్ బెల్లయ్య | 5,594 | 0.61 | -2.21 | |
మెజారిటీ | 19,262 | 2.09 | +18.44 | ||
మొత్తం పోలైన ఓట్లు | 921,872 | 75.90 | +0.36 | ||
తెరాస గెలుపు | మార్పు | +46.38 |
2008 ఉప ఎన్నిక[మార్చు]
2008 ఉప ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి యర్రబిల్లి దయాకరరావు సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి అయిన పి.రామేశ్వరరెడ్డి పై విజయం సాధించారు. ఈ ఎన్నికలలో దయాకరరావుకు 287323 ఓట్లు రాగా రామేశ్వర రెడ్డికి 282937 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజమౌళి[1] మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పరమేశ్వర్[1] భారతీయ జనతా పార్టీ తరఫున .జైపాల్ [2] కాంగ్రెస్ పార్టీ తరఫున టి.రాజయ్య పోటీచేశారు.[3] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజయ్య తన సమీప ప్రత్యర్థి తెరాస అభ్యర్థిపై 124661 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[4]
అభ్యర్థి (పార్టీ) | పొందిన ఓట్లు |
---|---|
సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెస్) | 3,96,568
|
రామగల్ల పరమేశ్వర్ (తె.రా.స) | 2,71,907
|