Jump to content

కడియం శ్రీహరి

వికీపీడియా నుండి
కడియం శ్రీహరి
కడియం శ్రీహరి


తెలంగాణ శాసనసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 డిసెంబర్ 3
ముందు టి.రాజయ్య
నియోజకవర్గం స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం

పదవీ కాలం
2015 జనవరి 25 – 2018 డిసెంబర్ 12
గవర్నరు ఇ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
తరువాత సబితా ఇంద్రారెడ్డి

పదవీ కాలం
2015 జనవరి 25 – 2018 డిసెంబర్ 12
గవర్నరు ఇ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు టి.రాజయ్య
తరువాత మల్లు భట్టి విక్రమార్క

పదవీ కాలం
2015 – 2023[1]
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

పదవీ కాలం
2014 – 2015
ముందు సిరిసిల్ల రాజయ్య
తరువాత పసునూరి దయాకర్
నియోజకవర్గం వరంగల్

పదవీ కాలం
1995 సెప్టెంబర్ 1 – 2004 మే 13

పదవీ కాలం
1994 డిసెంబర్ 12 – 1995 సెప్టెంబర్ 1

పదవీ కాలం
2008 – 2009
ముందు జి. విజయ రామారావు
తరువాత టి.రాజయ్య
నియోజకవర్గం స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం
పదవీ కాలం
1994 – 2004
ముందు బోనగిరి ఆరోగ్యం
తరువాత జి. విజయ రామారావు
నియోజకవర్గం స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-08) 1952 జులై 8 (వయసు: 73)
ప‌ర్వ‌త‌గిరి, వ‌రంగ‌ల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ (2024 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి (2013–2024)
తెలుగుదేశం పార్టీ (2013 వరకు)
జీవిత భాగస్వామి కె. వినయ రాణి
సంతానం కడియం కావ్య, దివ్య , రమ్య
నివాసం బంజారా హిల్స్, హైదరాబాద్, భారతదేశం

కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. అతను 2021 నవంబరులో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికై.[2] 2021 డిసెంబరు 01 నుండి 2023 డిసెంబరు 9 వరకు పనిచేశాడు.[3][4]

జననం - విద్యాభాస్యం

[మార్చు]

క‌డియం వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌ర్వ‌త‌గిరి గ్రామంలో 1958 జూలై 8 లో ల‌క్ష్మీ న‌ర్సింహ‌, దంపతులకు జ‌న్మించారు. కడియం శ్రీహరి వ‌రంగ‌ల్‌లోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో పదవ తరగతి పూర్తి చేశాడు. వ‌రంగ‌ల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసి, హైద‌రాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశాడు.[5] 1975-77 నుండి నిజామాబాద్ లో సిండికేట్ బ్యాంకులో మేనేజ‌ర్‌గా ప‌నిచేశాడు. 1977-1987 మధ్యకాలంలో టీచ‌ర్‌గా, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వ‌రంగ‌ల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. 1988 లో కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ చైర్మ‌న్ గా పనిచేశాడు. క‌డియం శ్రీ‌హ‌రి 1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పనిచేశాడు.[6] నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ, విద్య నీటిపారుద‌ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నాడు. 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు.

కడియం శ్రీహరి 2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశాడు.[7][8] అతను ఎమ్మెల్సీ పదవీకాలం 2021 జూన్ 3న ముగిసింది. కడియం శ్రీహరి తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 2021 నవంబరు 16న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబరు 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[9][10]

అతను 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి సింగాపురం ఇందిరపై 7,779 ఓట్ల మెజార్టీతో గెలిచి[11][12], డిసెంబరు 14న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[13]

కడియం శ్రీహరి 2024 మార్చి 31న బీఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[14]

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 1న కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కడియం శ్రీహరిని సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది.[15][16]

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (9 December 2023). "ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ నేతలు రాజీనామా.. ఆమోదించిన మండలి చైర్మన్" (in Telugu). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Namasthe Telangana (16 November 2021). "ఎమ్మెల్యే కోటా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 16 November 2021. Retrieved 16 November 2021.
  3. TNews Telugu (1 December 2021). "'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం షురూ". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
  4. 10TV Telugu (9 December 2023). "ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ నేతలు రాజీనామా.. ఆమోదించిన మండలి చైర్మన్" (in Telugu). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  6. Eenadu (12 November 2023). "అయిదుగురు మంత్రులు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  7. "Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana". Business Standard India. 25 January 2015. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019.
  8. సాక్షి, జిల్లాలు (25 January 2017). "కడియం.. రెండేళ్లు". Sakshi. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019.
  9. Andhrajyothy (22 November 2021). "తెలంగాణ: ఆ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
  10. telugu, NT News (22 August 2023). "వరంగల్‌ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
  11. Eenadu (4 December 2023). "ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలయ్యారు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  12. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  13. Namaste Telangana (15 December 2023). "ఎమ్మెల్యేలుగా కడియం, పల్లా ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  14. V6 Velugu (31 March 2024). "కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  15. "తెలంగాణ ఎడ్యుకేషన్‌ పాలసీ రూపకల్పనకు కమిటీ". Eenadu. 1 September 2025. Archived from the original on 1 September 2025. Retrieved 1 September 2025.
  16. "తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు". Andhrajyothy. 1 September 2025. Archived from the original on 1 September 2025. Retrieved 1 September 2025.

బయటి లింకులు

[మార్చు]