టి.రాజయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాటికొండ రాజయ్య
టి.రాజయ్య

మాజీ ఉప ముఖ్యమంత్రి , మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి


ఎమ్మెల్యే
పదవీ కాలం
2018 - ప్రస్తుతం
ముందు కడియం శ్రీహరి
నియోజకవర్గం స్టేషన్‌ ఘన్‌పూర్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1960-03-02)1960 మార్చి 2
స్టేషన్‌ ఘన్‌పూర్‌,వరంగల్ జిల్లా
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మారపాక వెంకటయ్య, లక్ష్మి
జీవిత భాగస్వామి ఫాతిమా మేరి
సంతానం క్రాంతిరాజ్‌, విరాజ్‌
నివాసం హైదరాబాదు
మతం హిందూ
జూన్ 3, 2014నాటికి

తాటికొండరాజయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా , వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు..[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

టీ.రాజయ్య సొంతూరు తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, తాటికొండ గ్రామం. ఆయన 2 మార్చి 1960 లో అమ్మమ్మ వాళ్లింట్లో అమ్మమ్మ వాళ్లింట్లో జనగామ జిల్లా , చిల్పూర్ మండలం , రాజవరం గ్రామంలో జన్మించాడు. రాజయ్య తల్లితండ్రులు మారపాక వెంకటయ్య, లక్ష్మి. ఆయన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో 1981లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

టీ. రాజయ్య 1997లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయనకు 2004లో టికెట్ దక్కలేదు తిరిగి 2008 లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. రాజయ్య 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11,600 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[2][3] ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి పై 32638 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.రాజయ్య 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా , వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 35790 ఓట్ల మెజారితో గెలిచాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 September 2014). "డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అంతరంగం". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
  2. "3 Telangana Congress MLAs set to join TRS". IBN Live. 2011-10-30. Archived from the original on 2013-10-09. Retrieved 2013-08-04.
  3. "Three Congress MLAs likely to join TRS". Zeenews. 2011-10-29. Retrieved 2013-08-04.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=టి.రాజయ్య&oldid=3275159" నుండి వెలికితీశారు