జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 4 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో కలిపారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభా నియోజకవర్గములు కూడా ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి. సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గ స్థానే ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు (జహీరాబాదు, ఆందోల్, నారాయణ్‌ఖేడ్) ఉండగా నిజామాబాదు జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ లతో కలిపి మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ, జహీరాబాదు. 2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో బి. బి. పాటిల్ గెలుపొందాడు.

దీని పరిధిలోని శాసనసభా నియోజకవర్గములు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 18,35,612 [1]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 17.61%, 7.72%.
  • ఓటర్ల సంఖ్య: 12,53,670.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019[2] 5 జహీరాబాదు జనరల్ బి. బి. పాటిల్ పు టీఆర్ఎస్ 434244 కె. మదన్ మోహన్ రావు పు కాంగ్రెస్ 428015
2014 5 జహీరాబాదు జనరల్ బి. బి. పాటిల్ పు టీఆర్ఎస్ 508661 సురేష్ కుమార్ షెట్కర్ పు కాంగ్రెస్ 364030
2009 5 జహీరాబాదు జనరల్ సురేష్ కుమార్ షెట్కర్ పు కాంగ్రెస్ 395767 సయ్యద్ యూసుఫ్ ఆలీ పు తె.రా.స 378360

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున శివకుమార్ లింగాయత్ పోటీ చేసారు.[3] పొత్తులో భాగంగా మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సయ్యద్ యూసఫ్ అలీ పోటీలో ఉన్నాడు.[4] కాంగ్రెస్ పార్టీ టికెట్ సురేశ్ షెట్కార్‌కు లభించింది.[5] సురేశ్ సమీప తె.రా.స పార్టీ పత్యర్థి అయిన యూసుఫ్ ఆలీ పై విజయం సాధించాడు.

2014 ఎన్నికలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
  2. Firstpost (2019). "Zahirabad Elections 2019: Telangana Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  4. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 28-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009