జహీరాబాద్ (M)
జహీరాబాద్ (M), తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలంలోని గ్రామం.[1]
జహీరాబాద్ (గ్రామీణ) | |
— రెవిన్యూ గ్రామం — | |
[[Image:|250px|none|]] | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మెదక్ |
మండలం | జహీరాబాద్ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది 9వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్ళు మార్గంలో ఉంది. జహీరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాదునుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది. పిన్ కోడ్ నం. 502 220., ఎస్.టి.డి.కోడ్ = 08451.
పైగా నవాబ్ "జహీర్ యార్ జంగ్" పేరు మీద ఈ పట్టణానికి జహీరాబాద్ అనే పేరు వచ్చింది. జహీరాబాద్ అక్షాంశ రేఖాంశాలు 17°41′N 77°37′E / 17.68°N 77.62°E[2]. సగటు ఎత్తు 622 మీటర్లు (2040 అడుగులు).
ఇక్కడి నుండి కర్ణాటక రాష్ట్ర్రపు బీదర్ పట్టణానికి 25 కి.మీ. దూరం.చుట్టుప్రక్కల గ్రామాలలో వ్యవసాయం ముఖ్య జీవనోపాధి. అంతే కాకుండా ఉపాధి కలిపించే మరి కొన్ని పరిశ్రమలున్నాయి - ఉదా - మహీంద్ర & మహీంద్ర, ట్రైడెంట్ షుగర్స్ (పాత పేరు నిజాం షుగర్స్), ముంగి (బస్ బాడీ బిల్డింగ్ యూనిట్). ఈ పరిశ్రమలకు తగినట్లుగా వాణిజ్య సదుపాయాలున్నాయి.అనేక గోడౌన్లు ఉన్నాయి.చుట్టుప్రక్కల గ్రామాలలో చెరకు ముఖ్యమైన పంట. జహీరాబాద్-బీదర్ దారిలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం ప్రసిద్ధి చెందింది.
దేవాలయాలు[మార్చు]
- సాయినాథుని మందిరం: సర్వమతాల సారం ఒక్కటేనని, సబ్ కా మాలిక్ ఏక్ అని ప్రవచించిన సద్గురువు శ్రీ సాయినాధుడు కొలువుదీరిన మందిరం ఇక్కడ నెలకొని ఉంది. వర్ణరంజిత ప్రాకారాదులతో శోభిల్లే ఈ మందిరం, వివిధ ఉపాలయాల సమాహారంగా భాసిల్లుతోంది.[1]
- కేతకి సంగమేశ్వర ఆలయం: జహీరాబాదు పట్టణానికి సుమారు 18 కి.మీ. దూరంలో చాలా ప్రసిద్ది చెందిన కేతకి సంగమేశ్వర ఆలయం కలదు, ఈ ఆలయం నుండి వారణాసి గంగా నదికి కాశీ లోని ఆలయం నుండి ఇక్కడి ఈ ఆలయంలోని జల ద్వారం నకు కలసి అంతర్వేదిగా ఉందని ప్రసిద్ది. కాశీ ఆలయం లోని ఒక ఋషి ఒక కమండలాన్ని ఆ జల ద్వారంలో వదిలితే ఇక్కడి కేతకి సంగమేశ్వర ఆలయంలో తేలిందని ప్రసిద్ది. సంవత్సరం పొడవునా ఎల్లపుడు నీటితో నిండి జల ద్వారం కలకలలాడుతు ఉంటుంది.
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ Falling Rain Genomics, Inc - Zahirabad