Jump to content

గొట్టం గుట్ట

వికీపీడియా నుండి
గొట్టం గుట్ట
గొట్టం గుట్ట
ప్రదేశంజహీరాబాద్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రకంగుట్ట

గొట్టం గుట్ట తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ సమీపంలో తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ప్రాంతం. తెలంగాణ ఊటీగా పేరొందిన ఈ ప్రాంతం చుట్టూ అడవి, కనుచూపుమేరలో పచ్చదనం, అందమైన జలపాతాలు, ఎత్తైన కొండలు ఉండి పర్యాటక ప్రాంతంగా నిలుస్తోంది.[1] ప్రతి శని, ఆదివారాలు ఇక్కడికి పెద్దసంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.[2]

ప్రత్యేకతలు

[మార్చు]

కర్ణాటకలో ప్రవహించే భీమ నదికి దగ్గరలో చించోలి వైల్డ్‌‌లైఫ్‌‌ అభయారణ్యం, ట్రెక్కింగ్‌‌, క్యాంపింగ్‌‌కు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతానికి వెళ్ళడానికి చేసే ప్రయాణం కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది. గొట్టం గుట్టకు పది కిలోమీటర్ల దూరంలోని జాడి మల్కాపూర్‌‌‌‌ దగ్గర ఉన్న జలపాతానికి ఎక్కువమంది సందర్శకులు వస్తుంటారు.[3]

ఇక్కడ శ్రీ గురు గంగాధర బక్క ప్రభు దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో శ్రావణమాసంలో ప్రత్యేక పూజలతోపాటు జాతర నిర్వహిస్తారు. ఈ ప్రాంతానికి కిందివైపు చంద్రగిరి డ్యామ్ ఉంది. 75 శాతం కర్ణాటక, 25 శాతం తెలంగాణ భూభాగంలో ఉన్న ఈ ప్రాంతంలో సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి.[4]

ప్రయాణం

[మార్చు]

హైదరాబాద్‌‌ నుంచి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్ట గుట్టకు రెండున్నర గంటల ప్రయాణం ఉంటుంది. జహీరాబాద్‌‌ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో, చంద్రపల్లి నుండి ఏడు కి.మీ.ల దూరంలో ఉంది. రోడ్డు ప్రయాణం ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడికి దగ్గరలోని జహీరాబాద్‌‌, కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతాలలో హోటల్స్‌‌, రిసార్ట్స్‌‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. వి6 వెలుగు, తెలంగాణ (30 July 2021). "తెలంగాణ ఊటీ గొట్టంగుట్ట..ఈ సీజన్ లో చూడాల్సిన బెస్ట్ ప్లేస్". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Hans India, Sunday Hans (15 June 2019). "A perfect weekend getaway drive!". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.
  3. తెలుగు వన్ ఇండియా, తెలంగాణ (9 February 2019). "వీకెండ్ స్పెషల్ : ఛలో తెలంగాణ ఊటీ.. గొట్టం గుట్ట". www.telugu.oneindia.com. Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.
  4. "తెలంగాణ ఊటీ 'గొట్టం గుట్ట' - Namasthetelangaana | DailyHunt Lite". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-20. Retrieved 2021-10-20.
  5. Indiatourism (2017-09-20). "Gottam Gutta – (Forest, Distance, Route map, Waterfalls near Zaheerabad)" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-20. Retrieved 2021-10-20.