Jump to content

కేతిరెడ్డి సురేష్‌రెడ్డి

వికీపీడియా నుండి
కేతిరెడ్డి సురేష్‌రెడ్డి
కేతిరెడ్డి సురేష్‌రెడ్డి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 ఏప్రిల్ 10
ముందు కెవిపి రామచంద్రారావు
నియోజకవర్గం తెలంగాణ

స్పీకర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
పదవీ కాలం
2004 - 2009
ముందు కావలి ప్రతిభా భారతి
తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
నియోజకవర్గం ఆర్మూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-05-25) 1959 మే 25 (వయసు 65)[1]
చౌటపల్లి, నిజామాబాద్ జిల్లా
జాతీయత తెలంగాణ,
భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు గోవిందరెడ్డి, విమలాదేవి
జీవిత భాగస్వామి పద్మజా రెడ్డి
సంతానం ఒక కొడుకు, ఒక కూతురు
వెబ్‌సైటు www.krsureshreddy.com Archived 2013-09-27 at the Wayback Machine

కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.[2] 2020 నుండి భారత్ రాష్ట్ర సమితి పార్టీ నుండి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. 2004 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా కూడా ఉన్నాడు.[3][4] కే.ఆర్‌. సురేష్ రెడ్డి 2024 జూన్ 16న బీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమితుడయ్యాడు.[5]

జీవిత విషయాలు

[మార్చు]

సురేష్ రెడ్డి 1959, మే 25న గోవిందరెడ్డి, విమలాదేవి దంపతులకు నిజామాబాదు జిల్లా చౌట్‌పల్లిలో జన్మించాడు. హైదరాబాదులోని నిజాం కళాశాల నుండి బిఏ పూర్తిచేశాడు.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సురేష్ రెడ్డికి పద్మజా రెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.

రాజకీయ జీవితం

[మార్చు]

1984లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించిన సురేష్ రెడ్డి 1989లో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బాల్కొండ శాసనసభా స్థానానికి అభ్యర్థిగా ప్రకటించుటకు కృషిచేయడంతో అతని రాజకీయ జీవితంలో దశమారింది. బాల్కొండ శాసనసభ నియోజకవర్గం నుంచి 1989 నుంచి 2004 ఎన్నికల వరకు నాలుగు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. ఆ నియోజకవర్గంలో మాజీ ఆర్థిక మంత్రి అర్గుల్ రాజారామ్ రికార్డును సమం చేశాడు. 1994 ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులలో ఒకరు సురేష్ రెడ్డి కాగా, మరొకరు డి. రెడ్యా నాయక్ . 2004లో 12వ శాసనసభకు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[7] నిజామాబాదు జిల్లా నుంచి ఈ పదవి పొందిన తొలి వ్యక్తి ఇతడే. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, 1990 నుండి 1993 వరకు అసెంబ్లీ లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు. 1997లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. 2000-2003 వరకు కాంగ్రెస్ పార్టీ విప్‌గా కూడా పనిచేశాడు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనకారణంగా, బాల్కొండ నియోజకవర్గం పునర్వ్యవస్థీకరించబడింది. దానికి బదులుగా ఆర్మూర్ నియోజకవర్గం నుండి పోటీచేయాలని వై.ఎస్. రాజశేఖరరెడ్డి సూచించాడు. తెలుగుదేశం, టిఆర్‌ఎస్ పార్టీల మధ్య పొత్తు ప్రభావం, అలాగే చిరంజీవి పిఆర్‌పి పార్టీ ఆవిర్భావం కారణంగా అతను ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. అలాగే 2014 ఎన్నికల్లో శాసనసభ ఎన్నికలలో కూడా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.

కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2018 సెప్టెంబరు 12న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[8][9] ఆయన 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[10]

రాజకీయ జీవితంలో పదవులు

[మార్చు]
  • 2004-09 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ [11]
  • కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
  • సభ్యుడు, అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల స్టాండింగ్ కమిటీ, భారతదేశ ప్రాంతీయ ప్రతినిధి
  • సభ్యుడు, ఇండియన్ రీజియన్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
  • కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు
  • 1999-2009, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
  • డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
  • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ విప్
  • సభ్యుడు, అంచనాల కమిటీ
  • ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
  • తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు

ఇతర వివరాలు

[మార్చు]

కెనడా, యుఎస్ఎ, రష్యా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి ద్వీపం, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపాలోని చాలా దేశాలు, ఆగ్నేయాసియా దేశాలు పర్యటించాడు.

మూలాలు

[మార్చు]
  1. rajyasabha.nic}}
  2. Eenadu (4 November 2023). "8 మంది హ్యాట్రిక్‌ వీరులు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  3. "Suresh Reddy lobbies for council seat". The Times of India. 5 April 2011. Retrieved 24 June 2019.
  4. "Title unknown". The Hindu. 2011-05-07. Archived from the original on 27 September 2013. Retrieved 16 July 2012.
  5. NT News (18 June 2024). "బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేశ్‌రెడ్డి". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  6. "Shri K.R. Suresh Reddy | National Portal of India". www.india.gov.in. Retrieved 2021-08-20.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-02. Retrieved 2009-05-18.
  8. The Hindu (13 September 2018). "Former Speaker Suresh Reddy joins TRS" (in Indian English). Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  9. Deccan Chronicle (13 September 2018). "Suresh Reddy joins TRS" (in ఇంగ్లీష్). Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  10. The New Indian Express (12 March 2020). "TRS to field K Keshava Rao, K R Suresh Reddy for Rajya Sabha elections". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  11. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.

యితర లింకులు

[మార్చు]