Jump to content

నిజామాబాద్ సౌత్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°40′19″N 78°05′38″E / 18.672°N 78.094°E / 18.672; 78.094
వికీపీడియా నుండి
(నిజామాబాదు మండలం నుండి దారిమార్పు చెందింది)

నిజామాబాద్ సౌత్ మండలం. తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

నిజామాబాదు
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నిజామాబాదు స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నిజామాబాదు స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నిజామాబాదు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°40′19″N 78°05′38″E / 18.672°N 78.094°E / 18.672; 78.094
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం నిజామాబాదు
గ్రామాలు 2
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 31 km² (12 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 4,12,500
 - పురుషులు 2,04,700
 - స్త్రీలు 2,07,800
అక్షరాస్యత (2011)
 - మొత్తం 66.55%
 - పురుషులు 76.41%
 - స్త్రీలు 56.61%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  2 అందులో అర్సపల్లి (పాక్షికం) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం నిజామాబాదు.

నిజామాబాద్ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తరువాత మూడవ పెద్ద నగరం. నగర జనాభా 4,23,253. దేశంలోనే పెద్దదయిన 7వ నంబర్, 16 నంబర్ జాతీయ రహదారులు నిజామాబాద్ గుండా పోతాయి. ఇది ఉత్తర, దక్షిణ భారతావనిని కలిపే రహదారి. ఒకప్పుడు తెలంగాణకు ధాన్యాగారంగా విలసిల్లి, ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి పొందిన నిజాం చక్కెర కర్మాగారం నిజామాబాద్ జిల్లాలో ఉంది.

మండల పూర్వాపరాలు

[మార్చు]

ఈ మండలం అవిభక్త నిజామాబాదు జిల్లాలో నిజామాబాదు మండలం అనే పేరుతో నిజామాబాదు రెవెన్యూడివిజనులో 35 రెవెన్యూ గ్రామాలతో ఉండేది.2016 లో జరిగిన జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణలో ఈ మండలం నిజామాబాదు, అర్సపల్లి (పార్టు) పట్టణ ప్రాంతాలతో నిజామాబాద్ సౌత్ మండలంగా ఏర్పడింది, పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలంలో ఉన్న 35 రెవెన్యూ గ్రామాలు 2016 పునర్వ్యవస్థీకరణలో ఇదే జిల్లా, ఇదే రెవెన్యూ డివిజనులో నిజామాబాద్ గ్రామీణ మండలం 19 గ్రామాలతో, ముగ్పాల్ మండలం 15 గ్రామాలతో కొత్తగా ఏర్పడినవి.35 గ్రామాలలో మిగిలిన ముల్లంగి (గ్రామం) ఒక్క గ్రామం డిచ్‌పల్లి మండలం (పాత మండలం)లో విలీనం అయింది.[3]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజాామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 4,12,500 - పురుషులు 2,04,700 - స్త్రీలు 2,07,800. అక్షరాస్యత మొత్తం 66.55% - పురుషులు 76.41% - స్త్రీలు 56.61%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 31 చ.కి.మీ. కాగా, జనాభా 153,569. జనాభాలో పురుషులు 76,465 కాగా, స్త్రీల సంఖ్య 77,104. మండలంలో 33,309 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. నిజామాబాదు
  2. అర్సపల్లి (పాక్షికం)

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-25.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Villages and Towns in Nizamabad Mandal of Nizamabad, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-12-02. Retrieved 2022-08-01.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]