రుద్రూర్ మండలం
రుద్రూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, రుద్రూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°35′00″N 77°52′34″E / 18.583291°N 77.875975°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | రుద్రూర్ |
గ్రామాలు | 9 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 49 km² (18.9 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 21,909 |
- పురుషులు | 10,637 |
- స్త్రీలు | 11,272. |
పిన్‌కోడ్ |
రుద్రూర్ మండలం తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం [1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ప్రస్తుతం ఈ మండలం బోధన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండల కేంద్రం రుద్రూర్ గ్రామం నిజామాబాదు డివిజనులో, వర్ని మండలంలో ఉండేది. ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. రుద్రూర్ మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 49 చ.కి.మీ. కాగా, జనాభా 21,909. జనాభాలో పురుషులు 10,637 కాగా, స్త్రీల సంఖ్య 11,272. మండలంలో 5,313 గృహాలున్నాయి.[3]
2016 లో ఏర్పడిన మండలం
[మార్చు]ఇంతకుముందు రుద్రూర్ గ్రామం నిజామాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని వర్ని మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా రుద్రూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన భోధన్ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+09 (పది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.