సిరికొండ మండలం (నిజామాబాదు జిల్లా)
సిరికొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]
సిరికొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, సిరికొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°35′34″N 78°26′56″E / 18.592887°N 78.44902°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | సిరికొండ (నిజామాబాదు జిల్లా) |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 332 km² (128.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 51,078 |
- పురుషులు | 24,673 |
- స్త్రీలు | 26,405 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.96% |
- పురుషులు | 58.22% |
- స్త్రీలు | 30.59% |
పిన్‌కోడ్ | 503165 |
ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం సిరికొండ.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 51,078 - పురుషులు 24,673- స్త్రీలు 26,405.,అక్షరాస్యత (2011) - మొత్తం 43.96% - పురుషులు 58.22% - స్త్రీలు 30.59%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 332 చ.కి.మీ. కాగా, జనాభా 41,751. జనాభాలో పురుషులు 20,203 కాగా, స్త్రీల సంఖ్య 21,548. మండలంలో 9,844 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- చిమన్‌పల్లె
- చిన్న వాల్గోట్
- గడ్కోల్
- హుస్సేన్‌నగర్
- కొండాపూర్
- కొండూర్
- మైలారం
- ముషీర్‌నగర్
- న్యావనంది
- పాఖాల్
- పందిమడుగు
- పెద్ద వాల్గోట్
- పోత్నూర్
- రామడుగు
- రావుట్ల
- సిరికొండ
- తాట్‌పల్లె
- తూంపల్లె
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మండల విశేషాలు
[మార్చు]ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలావాత్ పూర్ణను కన్న నేల పాకాల.బాజిరెడ్డి గోవర్ధన్ సొంత మండలం మండలంలోని హొన్నాజిపేట్ గ్రామం పూర్వం రాజుల పాలనలో ఉండేది. అందుకు నిదర్శనమే హొన్నాజిపేట్ గడి. కొన్ని సంవత్సరాల ముందు నిర్మించిన ఈ కొట ఇప్పుడు శిథిలావస్థకు చేరింది.హొన్నాజిపేటకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం వాడి.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.