మెండోర మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెండోర
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మెండోర స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మెండోర స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మెండోర స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం మెండోర
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం 28,439
 - పురుషులు 13,506
 - స్త్రీలు 14,933
పిన్‌కోడ్ 503219

మెండోర మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణం ఆర్మూర్ నుండి 26 కి. మీ. దూరంలో 7వ జాతీయ రహదారి పక్కన ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం ఏర్పడింది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండల కేంద్రం మెండోరా ఇది నిజామాబాదు డివిజనులో బాల్కొండ మండలంలో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:04344.[3] మెండోర మండలం, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. మండల కేంద్రం మెండోర.

గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 74 చ.కి.మీ. కాగా, జనాభా 28,439. జనాభాలో పురుషులు 13,506 కాగా, స్త్రీల సంఖ్య 14,933. మండలంలో 6,917 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన కొత్త మండలం[మార్చు]

గతంలో మెండోర గ్రామం నిజామబాదు జిల్లా, నిజామాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోని బాల్కొండ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మెండోర గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా నిజామాబాదు జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆర్మూరు రెవెన్యూ డివిజను పరిధిలో 8 (1 +7) (ఎనిమిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. మెండోర
 2. చకెరియాల్
 3. సావేల్
 4. సోన్‌పేట్
 5. దూద్‌గావ్
 6. కోడేచెర్ల
 7. బుస్సాపూర్
 8. వెలగటూర్

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nizamabad.pdf
 2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
 3. "Nirmal Mandal Villages, Adilabad, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-23.
 4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]