ఆర్మూరు రెవెన్యూ డివిజను
ఆర్మూరు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు |
ఆర్మూరు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నిజామాబాదు జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 11 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఆర్మూరులో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం, ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
[మార్చు]ఆర్మూరు డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | ఆర్మూరు రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | ఆర్మూరు మండలం | 23 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
2 | బాల్కొండ మండలం | 11 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
3 | మెండోర మండలం | 8 రెవెన్యూ గ్రామాలు |
4 | ముప్కాల్ మండలం | 7 రెవెన్యూ గ్రామాలు |
5 | కమ్మర్‌పల్లి మండలం | 17 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
6 | వేల్పూర్ మండలం | 17 రెవెన్యూ గ్రామాలు |
7 | మోర్తాడ్ మండలం | 9 రెవెన్యూ గ్రామాలు |
8 | ఏర్గట్ల మండలం | 7 రెవెన్యూ గ్రామాలు |
9 | భీంగల్ మండలం | 24 రెవెన్యూ గ్రామాలు |
10 | నందిపేట్ మండలం | 30 రెవెన్యూ గ్రామాలు |
11 | జక్రాన్‌పల్లి మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-21.
- ↑ "Revenue Divisions | Nizamabad District | India". www.nizamabad.telangana.gov.in. Archived from the original on 2022-01-30. Retrieved 2022-04-17.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2022-04-21.